కరోనా వేళ జీవనోపాధి, మహిళా సాధికారత

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇంటింటికీ బల్క్ డెలివరీకి ఉపయోగపడే వాహనాలను తయారు చేయడం ద్వారా ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించింది.

కరోనా వేళ జీవనోపాధి, మహిళా సాధికారత
Follow us

|

Updated on: Oct 17, 2020 | 7:53 PM

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇంటింటికీ బల్క్ డెలివరీకి ఉపయోగపడే వాహనాలను తయారు చేయడం ద్వారా ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించింది. ‘ఎరైడ్ ఇ-మొబిలిటీ’ చేత తయారు చేయబడిన వాహనాలు ధరల పరంగా చాలా సరసమైనవి. వాటిని ఉపయోగించే వ్యక్తుల సంపాదన సామర్థ్యాలకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. 

 సంస్థ వ్యవస్థాపకుడు, దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ “మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి కారణంగా, ప్రజలు కొనుగోల పద్ధతిలో మార్పును మేము గమనించాము. మార్కెట్లు, దుకాణాలకు వెళ్లడం మానేసి కావాల్సిన వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం, వాటిని ఇంటి వద్దనే పంపిణీ చేయడం వంటి పద్దతులు ప్రజలు అవలంభిస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా డెలివరీ వాహనాల డిమాండ్ పెరిగింది. ” అని పేర్కొన్నారు. సంస్థను ప్రారంభించే ముందు, ప్రజల డిమాండ్‌ను గమనించడానికి తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించానని, కాకపోతే కంపెనీ వృద్ధి చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ సేంద్రియంగా ఉందని వివరించారు. 

“మేము కంపెనీలు లేదా మా ఖాతాదారుల డిమాండ్ల ఆధారంగా వాహనాలను సృష్టిస్తున్నాం. మేము ఎక్కువగా డెలివరీ, ఆన్-వీల్ మార్కెట్ల వంటి వాహనాలను తయారుచేస్తున్నాం. ఇ-కామర్స్ కంపెనీల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసాము. మీట్ ఆన్ వీల్స్, కూరగాయలు, పండ్లు, పాలు అమ్మకాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సృష్టించాము”అని దేవెందర్ రెడ్డి చెప్పారు. వాహనాల సరఫరా కోసం ఈ సంస్థ ఇటీవల తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో పాటు ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. (హైదరాబాద్‌‌లో‌ మళ్ళీ దంచి కొడుతోన్న భారీ వర్షం )

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘షీ-రిక్షాలు’ ప్రారంభించాలన్నది తన డ్రీమ్ ప్రాజెక్టు అని రెడ్డి తెలిపారు. ఈ వాహనాలను ఎలా నడపాలో నేర్పించడమే కాకుండా, వాహనాల సేవా స్థాయి నిర్వహణ, ఆత్మరక్షణకు సంబంధించి కూడా మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ( ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌ )

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?