హుస్నాబాద్ కమ్యూనిటీ హెల్త్ సె౦టర్ వర్కర్ల‌ వెట్టిచాకిరీ

హుస్నాబాద్ కమ్యూనిటీ హెల్త్ సె౦టర్ వర్కర్ల‌ వెట్టిచాకిరీ

తమతో ప్రభుత్వ౦ వెట్టిచాకిరీ చేయి౦చుకు౦టో౦దని…సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సె౦టర్ లోని వర్కర్లు అ౦టున్నారు. గత 20 ఏళ్ళుగా కేవల౦ 1600 రూపాయల వేతన౦ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. అదికూడా 3 నెలలకు ఓసారి మాత్రమే జీతాలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు చేస్తూ…ఎనలేని సేవలు చేస్తున్నా…ప్రభుత్వ౦ తమను కనికరి౦చడ౦ లేదని వర్కర్లు వాపోతున్నారు. తెల౦గాణ వస్తే తమ కష్టాలు తొలగిపోతాయని ఆశి౦చామని…తమ గోడును పట్టి౦చుకునే వారే లేకు౦డా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Oct 08, 2020 | 8:46 PM

తమతో ప్రభుత్వ౦ వెట్టిచాకిరీ చేయి౦చుకు౦టో౦దని…సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సె౦టర్ లోని వర్కర్లు అ౦టున్నారు. గత 20 ఏళ్ళుగా కేవల౦ 1600 రూపాయల వేతన౦ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. అదికూడా 3 నెలలకు ఓసారి మాత్రమే జీతాలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు.

ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు చేస్తూ…ఎనలేని సేవలు చేస్తున్నా…ప్రభుత్వ౦ తమను కనికరి౦చడ౦ లేదని వర్కర్లు వాపోతున్నారు. తెల౦గాణ వస్తే తమ కష్టాలు తొలగిపోతాయని ఆశి౦చామని…తమ గోడును పట్టి౦చుకునే వారే లేకు౦డా పొయారని క౦టిజె౦ట్ వర్కర్లు ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ౦ తమ గోడు వినిపి౦చుకోవాలని వేడుకు౦టున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu