కంత్రీ కపుల్.. రెండో భార్య నగ్నవీడియోలతో బెదిరింపులు

ఒక అభాగ్యురాల్ని నిట్టనిలువునా దోపిడీ చేశారో కంత్రీ భార్యా భర్తలు. మొదటి భర్త మోసం చేశాడని భార్య మరో అతనికి దగ్గరైంది ఒక వివాహిత. అదే అదునుగా భావించిన శ్రీనివాసరెడ్డి ఆమెను అన్ని విధాలుగా..

కంత్రీ కపుల్.. రెండో భార్య నగ్నవీడియోలతో బెదిరింపులు
Pardhasaradhi Peri

|

Sep 01, 2020 | 9:10 PM

ఒక అభాగ్యురాల్ని నిట్టనిలువునా దోపిడీ చేశారో కంత్రీ భార్యా భర్తలు. మొదటి భర్త మోసం చేశాడని భార్య మరో అతనికి దగ్గరైంది ఒక వివాహిత. అదే అదునుగా భావించిన శ్రీనివాసరెడ్డి ఆమెను అన్ని విధాలుగా వాడుకొని లక్షలు గుంజేశాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తన భార్యకు విడాకులిచ్చేందుకంటూ ఆరు లక్షలు వసూలు చేశాడు. వివిధ కారణాలు చెప్పి అరకిలో బంగారు నగలు, రూ. 14 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు, ఇంకా భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బు ఉన్నాయని గ్రహించి తన భార్య, అత్త, బావమరిదితో కలిసి కొత్త పథకానికి తెరతీశాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి మొదటి భార్య, అతని తల్లి, బావమరిది కలిసి రెండో భార్య స్నానం చేస్తున్న సమయంలో నగ్న వీడియోలు తీశారు. ఆమె శీలాన్ని రూ. 20 లక్షలకు వెలకట్టి ఆ డబ్బు ఇస్తేనే వీడియోలు ఇస్తామని నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చెయ్యడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu