లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు తూట్లు.. గుంపులుగా ఎగ‌బ‌డిన జ‌నం..

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. క‌రోనా వైర‌స్ వేళ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లంతా

లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు తూట్లు.. గుంపులుగా ఎగ‌బ‌డిన జ‌నం..
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 5:30 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. క‌రోనా వైర‌స్ వేళ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లంతా గుమిగూడ‌కుండా, ఎవ‌రి ఇళ్ల‌లో వారే ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించ‌డంతోపాటు, ఎవ‌రికి వారే సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపింది.

కాగా.. బెంగ‌ళూరులో ప్ర‌భుత్వం ఉచితంగా పాల‌ను పంచుతోందని తెలిసి, జ‌న‌మంతా గుంపులు గుమిగూడారు. బాధ్య‌తాయుతంగా క్యూను పాటించ‌డం మ‌రిచి, ప్యాకెట్ల కోసం ఎగ‌బ‌డ‌టం షాక్‌కు గురిచేస్తోంది. నిజానికి లాక్‌డౌన్ వేళ పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం గొప్ప మ‌నసుతో ఉచిత పాల ప్యాకెట్ల పంపిణీని ప్ర‌క‌టించింది. అయితే పంపిణీలో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. నగరంలోని రాజాజీ న‌గ‌ర్‌, మంజునాథవార్డులో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇక క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు 230 మందికిపైగా పాజిటివ్‌గా తేలారు, ఆరుగురు మ‌ర‌ణించారు.

Also Read: వాహనదారులకు అలర్ట్: అక్కడ.. నో మాస్క్… నో పెట్రోల్…