తెలంగాణకు 3 లక్షల ఉద్యోగాలు..భేష్ కెటీఆర్..!

తెలంగాణకు 3 లక్షల ఉద్యోగాలు..భేష్ కెటీఆర్..!

వచ్చే నాలుగేళ్ళలో తెలంగాణాలో భారీ ఉద్యోగాల జాతర జరగబోతోందా? తెలంగాణ ఐటి, మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెబుతున్న మాటలు నిజమైతే రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్ళలో భారీ స్థాయిలో ఐ.టి. ఉద్యోగాల జాతర జరగబోతోంది. ఇప్పటికే రెండు ఐ.టి. క్లస్టర్స్‌తో తెలంగాణ ఐటి రంగంలో దూసుకుపోతోందని, తాజాగా కేంద్రాన్ని మూడో ఐ.టి. క్లస్టర్ అడిగామని.. అది గనక సాంక్షన్ అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు సుమారు 3 లక్షల మేరకు ఐటి ఉద్యోగాలు వస్తాయని కెటీఆర్ […]

Rajesh Sharma

|

Dec 03, 2019 | 12:48 PM

వచ్చే నాలుగేళ్ళలో తెలంగాణాలో భారీ ఉద్యోగాల జాతర జరగబోతోందా? తెలంగాణ ఐటి, మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెబుతున్న మాటలు నిజమైతే రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్ళలో భారీ స్థాయిలో ఐ.టి. ఉద్యోగాల జాతర జరగబోతోంది. ఇప్పటికే రెండు ఐ.టి. క్లస్టర్స్‌తో తెలంగాణ ఐటి రంగంలో దూసుకుపోతోందని, తాజాగా కేంద్రాన్ని మూడో ఐ.టి. క్లస్టర్ అడిగామని.. అది గనక సాంక్షన్ అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు సుమారు 3 లక్షల మేరకు ఐటి ఉద్యోగాలు వస్తాయని కెటీఆర్ చెబుతున్నారు.

హైదరాబాద్ రెండో ఐటి క్లస్టర్ ఏరియాలో కెటీఆర్… ఇంటెల్ డెవలప్‌మెట్ యూనిట్‌ను సోమవారం ప్రారంభించారు. ఆ తర్వాత మంగళవారం ఐటి అభివ‌ృద్ధి ప్రణాళికపై సమీక్ష జరిపారు. గత అయిదేళ్ళలో సుమారు లక్ష మేరకు ఐటి ఉద్యోగాలు వచ్చాయని సమీక్షలో వెల్లడైంది. మూడో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ మంజూరులో కేంద్ర సహకరిస్తే వచ్చే నాలుగు సంవత్సరాలలో హైదరాబాద్‌లో ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందని కెటీఆర్ భావిస్తున్నారు.

ఇటీవల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన సందర్భంలో హైదరాబాద్‌కు మూడో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరినట్లు కెటీఆర్ వెల్లడించారు. ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తుందని కెటీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణలో ఐటి పరిశ్రమ అభివృద్ది మరింత వేగవంతమవుతుందని మంత్రి భావిస్తున్నారు. ఏదిఏమైనా కెటీఆర్ అంచనాలు నిజం కావాలని కోరుకుందాం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu