శాస్త్రోక్తంగా తిరుమల వెంకన్న పుష్పయాగ మహోత్సవం, 7 టన్నుల పూలు వినియోగం

కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 3:21 pm, Sat, 21 November 20
శాస్త్రోక్తంగా తిరుమల వెంకన్న పుష్పయాగ మహోత్సవం,  7 టన్నుల పూలు వినియోగం

కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఉత్సవమూర్తులకు ఉదయం స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏడు టన్నుల పుష్పాలతో పుష్పార్చన చేయనున్నారు.  నాలుగు టన్నుల పూలు తమిళనాడు , రెండు కర్ణాటక, ఒక టన్ను ఆంధ్రా- తెలంగాణ నుంచి వచ్చాయి. 14 రకాల కుసుమాలు, 6 రకాల పత్రాలను పుష్పయాగంలో వినియోగిస్తున్నారు అర్చకులు. రోజాలు, సంపంగి, మల్లెలు, చామంతి, రుక్షి, గన్నేరు, మొల్లలు, తామరలు, కలువ, మొగలిరేకులు, కనకాంబరం, మాను సంపంగి, సెంటు జాజులు, పగడపూలు.. పత్రాలకు సంబంధించి తులసి, మరువం, ధవనం, బిల్వము, కదిరిపచ్చ, పన్నీరాకు స్వామివారి పుష్పయాగంలో భాగమవ్వనున్నాయి.

భక్తులు విరాళంగా పంపిన పూలకు పూజలు నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు ద్వారా తెలుస్తోంది. పూర్వం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని వేద పండితులు చెబుతున్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్