గురుశిష్యుల ‘వార్’.. బాక్స్ ఆఫీస్ గేమ్‌ ఓవర్!

గురుశిష్యుల 'వార్'.. బాక్స్ ఆఫీస్ గేమ్‌ ఓవర్!

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’. హాట్ బ్యూటీ వాణీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు. కబీర్(హృతిక్ రోషన్) మాజీ ఆర్మీ ఆఫీసర్. ఒకానొక సందర్భంలో అతడు ఆర్మీ కార్గో విమానం నుంచి […]

Ravi Kiran

|

Aug 27, 2019 | 12:00 PM

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’. హాట్ బ్యూటీ వాణీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు.

కబీర్(హృతిక్ రోషన్) మాజీ ఆర్మీ ఆఫీసర్. ఒకానొక సందర్భంలో అతడు ఆర్మీ కార్గో విమానం నుంచి అత్యంత విలువైన రహస్యాలను దొంగిలిస్తాడు. వాటితో దేశానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో రక్షణశాఖ మంత్రి కబీర్‌ను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా కల్నల్ లూథ్రా( అశుతోష్ రాణా) కబీర్ శిష్యుడైన ఖలీద్(టైగర్)కు పట్టుకునే పనిని అప్పగిస్తాడు. అసలు కబీర్ విలువైన రహస్యాలను ఎందుకు దొంగిలించాడు.? ఖలీద్.. కబీర్‌ను పట్టుకోగలిగాడా.? గురుశిష్యుల్లో ఎవరు పైచేయి సాధించారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఇద్దరు హీరోల స్టంట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తాయి. వాణీ అందాలు.. యాక్షన్ సీన్స్.. కావాల్సినంత థ్రిల్ సగటు ప్రేక్షకుడికి ఈ మూవీ నుంచి లభిస్తుంది. ట్రైలర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu