కరోనా వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేస్తున్న పాకిస్తాన్‌

కరోనా మహమ్మారిని కంట్రోల్‌ చేయడానికి పెద్ద పెద్ద తోపు దేశాలే కుస్తీలు పడుతుంటే పాకిస్తాన్‌లో మాత్రం కేసులు తగ్గుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..

కరోనా వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేస్తున్న పాకిస్తాన్‌
Balu

|

Sep 03, 2020 | 2:58 PM

కరోనా మహమ్మారిని కంట్రోల్‌ చేయడానికి పెద్ద పెద్ద తోపు దేశాలే కుస్తీలు పడుతుంటే పాకిస్తాన్‌లో మాత్రం కేసులు తగ్గుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అమెరికా, బ్రిటన్‌, ఇండియా వంటి దేశాలలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.. పాకిస్తాన్‌లో మాత్రం కేసులు తగ్గుతున్నాయి.. పదుల సంఖ్య నుంచి సింగిల్‌ డిజిట్‌కు కేసులు నమోదు కావడం నిజంగానే విస్మయంగొలుపుతోంది.. పాకిస్తాన్‌ ఎలాంటి దేశమో అందరికీ తెలుసు.. అక్కడ మెరుగైన వైద్య చికిత్సలు అంతగా ఉండవన్న సంగతీ తెలుసు.. మరి కరోనా కేసులు ఎలా తగ్గుతున్నాయన్నదే అంతుపట్టకుండా ఉంది.. దీనికి పాకిస్తాన్‌వాళ్లు ఓ కారణం చెబుతున్నారు.. మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ యువత ఎక్కువట! పైపెచ్చు వారిలో ఇమ్యూనిటీ పవర్‌ కూడా ఒకింత ఎక్కువేనట! కరోనా వైరస్‌ సోకినా ఈజీగా తగ్గించుకుంటున్నారట! అసలు ఆసుపత్రులకు వెళ్లకుండానే కరోనా నుంచి స్వస్థత పొందుతున్నారట! ఇంతేనా… పాకిస్తాన్‌లో వృద్ధుల శాతం కూడా తక్కువగానే ఉంది.. ఇదంతా నిజమే కావచ్చు కానీ.. కరోనా విషయంలో పాకిస్తాన్‌ అబద్ధాలు ఆడటం లేదు కదా అన్న అనుమానమూ కొందరికి కలుగుతోంది.. ఇరుకు వీధుల్లో.. ఇరుకు ఇళ్లల్లో ఉండేవారికి కరోనా సోకకపోవడమేమిటన్న సందేహమూ వస్తోంది.. పాకిస్తాన్‌ డాక్టర్లకు కూడా ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. వారు కూడా కరోనా కేసులు ఎలా తగ్గుతున్నాయన్నదానికి కచ్చితమైన జవాబు ఇవ్వలేకపోతున్నారు.. ఏమో మరి.. నిజంగానే పాకిస్తానీయులకు ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువేమో!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu