ఆస్పత్రి బిల్లులపై పరిమితులు విధించినా, 80 శాతం కుటుంబాలపై ప్రభావం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు భారీ దోపిడికి తెగబడ్డాయి. ప్రాణం మీదకి వచ్చే వ్యాధి కావడంతో ప్రజలు ఆస్తులు అమ్ముకోని మరీ చికిత్స తీసుకుంటున్నారు.

ఆస్పత్రి బిల్లులపై పరిమితులు విధించినా, 80 శాతం కుటుంబాలపై ప్రభావం
Follow us

|

Updated on: Oct 12, 2020 | 8:51 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు భారీ దోపిడికి తెగబడ్డాయి. ప్రాణం మీదకి వచ్చే వ్యాధి కావడంతో ప్రజలు ఆస్తులు అమ్ముకోని మరీ చికిత్స తీసుకుంటున్నారు. ప్రవేట్ ఆస్పత్రుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కోవిడ్-19 చికిత్సకు అయ్యే వ్యయంపై పరిమితులు విధించాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఒకరికి కోవిడ్ సోకినా చికిత్సకు అయ్యే ఖర్చుతో దేశంలోని 80 శాతం కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే బిల్లులపై పరిమితులు విధించినా కనీసం పది రోజుల చికిత్సకయ్యే వ్యయం నెలవారీ ఖర్చుల కంటే అధికంగా ఉంటుంది.  జాతీయ గణాంక కార్యాలయం 2017-18 రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని 80 శాతం కుటుంబాలు తలసరి వ్యయం నెలకు తక్కువలో తక్కువగా రూ.5వేలు లేదా రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఇక, గుర్తింపులేని ఆస్పత్రుల్లోనూ కోవిడ్-19కు పది రోజుల చికిత్స కోసం రూ.80,000 వరకు దండుకుంటున్నాయి. ఇది 80 శాతం జనాభా నెలవారీ తలసరి వ్యయానికి మూడు రెట్లు ఎక్కువ. ఒకవేళ, ఐసీయూలో చికిత్స అవసరమైతే ఇక బిల్లుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.

మొత్తం 20 రాష్ట్రాలలో వెంటిలేటర్ లేని ఐసీయూ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్ ఉన్నవారికి పది రోజుల ట్రీట్మెంట్ ఖర్చును ప్రతి రాష్ట్రంలో నెలవారీ తలసరి వ్యయాన్ని తాజా రిపోర్టుతో పోల్చి చూస్తే 80 శాతం మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. ప్రభుత్వాలు ధరల పరిమితులు పెట్టినప్పటికీ పీపీఈ, సీటీ, ఎంఆర్ఐ వంటి టెస్టులు, మెడిసిన్స్, స్పెషలిస్ట్ ఛార్జీలు పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వసూళ్లకు తెగబడుతున్నాయి. (పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!)

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్