బెంగాల్ లో పాగాకు బీజేపీ రెడీ, కోల్ కతా చేరుకున్న హోం మంత్రి అమిత్ షా, ఇక టీఎంసీ రెబెల్స్ చేరిక!

పశ్చిమ బెంగాల్ లో హైడ్రామాకు తెర లేచింది. రెండు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా శనివారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో కోల్ కతా చేరుకున్నారు.

బెంగాల్ లో పాగాకు బీజేపీ రెడీ, కోల్ కతా చేరుకున్న హోం మంత్రి అమిత్ షా, ఇక టీఎంసీ రెబెల్స్ చేరిక!
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Dec 19, 2020 | 10:56 AM

పశ్చిమ బెంగాల్ లో హైడ్రామాకు తెర లేచింది. రెండు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా శనివారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో కోల్ కతా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు వందలాది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరో నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బెంగాల్ లో బీజేపీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి  కూడా వైదొలగిన సీనియర్ నేత సువెందు అధికారిని అమిత్ షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అధికారితో బాటు ఆయన సహచరులు, టీఎంసీ రెబెల్స్ పలువురు బీజేపీలో చేరే సూచనలున్నాయి. కమలం పార్టీలో వీరి చేరిక, ముఖ్యంగా అధికారి చేరిక డార్జిలింగ్ నుంచి దీఘా వరకు పెను రాజకీయ తుపానును సృష్టించవచ్చునని భావిస్తున్నారు. అయితే తాజా పరిణామమొకటి బీజేపీని షాక్ కి గురి చేసింది. నిన్నటివరకు అధికారితోబాటు ఈ పార్టీలో చేరవచ్ఛునని భావించిన మరో సీనియర్ నేత జితేంద్ర తివారీ హఠాత్తుగా మనసు మార్చుకుని తిరిగి తన మాతృ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం విశేషం.

అమిత్ షా శనివారం కోల్ కతా లోను, సమీప నగరాల్లోనూ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కోల్ కతా లో స్వామి వివేకానంద గృహాన్ని సందర్శించి ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం హెలీకాఫ్టర్లో ఈ నగరానికి 150 కి.మీ. దూరంలోని మెడిన్ పూర్ టౌన్ కి  చేరుకొని అక్కడ నిర్వహించే ర్యాలీలో ఆయన పాల్గొంటారు. రేపు విశ్వభారతి యూనివర్సిటీని ఆయన సందర్శిస్తారు. అసెంబ్లీ ఎన్నికలవరకు ఆయన, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతి నెలా ఈ నగరాన్ని విజిట్ చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu