‘డిస్‌లైక్’.. సడక్-2 ట్రైలర్‌ సరికొత్త రికార్డ్..

'డిస్‌లైక్'.. సడక్-2 ట్రైలర్‌ సరికొత్త రికార్డ్..

‘సడక్ 2’ట్రైలర్ ఈ రోజు విడులైంది. ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ముందెన్నడూ ఇంతలా ఏ చిత్రానికి.. ఏ వీడియోకు రానంతగా దీనికి వస్తున్నాయి. ‘సడక్ 2’ట్రైలర్...

Sanjay Kasula

|

Aug 12, 2020 | 8:40 PM

Hitting ‘Dislike’ on SADAK 2 Trailer : బాలీవుడ్‌ను సుశాంత్ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ఎంతో టాలెంట్‌తో దూసుకుపోతున్న యువ కెరటం అర్ధంతంరంగా ముగియటంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం వల్లే సుశాంత్‌ చనిపోయాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నడాని ముంబై ఫిల్మ్ నగర్ అనుమానిస్తోంది. అయితే ఈ ప్రభావం కాస్తా మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్‌ 2’పై ఉప్పెనలా పడింది.

సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ట్రైలర్ ఈ రోజు విడులైంది. ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ముందెన్నడూ ఇంతలా ఏ చిత్రానికి.. ఏ వీడియోకు రానంతగా దీనికి వస్తున్నాయి. ‘సడక్ 2’ట్రైలర్ డిస్ లైక్ ల రికార్డు కొనసాగుతోంది.

ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్‌ కొడితే.. 2.5మిలయన్ల మంది డిస్‌లైక్‌ నొక్కేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్‌ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu