Doctor Kafeel Khan: డాక్టర్ కఫీల్ ఖాన్ పై హిస్టరీ షీట్ తెరచిన గోరఖ్ పూర్ పోలీసులు, మరో 80 మందిపై కూడా

యూపీలో వివాదాస్పదుడైన డాక్టర్ కఫీల్ ఖాన్ పై గోరఖ్ పూర్ పోలీసులు హిస్టరీ షీట్ తెరిచారు. మరో 80 మందితో బాటు ఈయన ను కూడా ఈ జాబితాలో చేర్చారు..

Doctor Kafeel Khan: డాక్టర్ కఫీల్ ఖాన్ పై హిస్టరీ షీట్ తెరచిన గోరఖ్ పూర్ పోలీసులు, మరో 80 మందిపై కూడా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2021 | 11:17 AM

యూపీలో వివాదాస్పదుడైన డాక్టర్ కఫీల్ ఖాన్ పై గోరఖ్ పూర్ పోలీసులు హిస్టరీ షీట్ తెరిచారు. మరో 80 మందితో బాటు ఈయన ను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరికీ క్రిమినల్ చరిత్ర ఉందని పేర్కొన్నారు. 2017 లో తను పని చేస్తున్న ఆసుపత్రిలో ఆక్సిజన్ గ్యాస్ కొరత కారణంగా పలువురు చిన్నారులు మరణించిన ఘటనకు బాధ్యుడని భావిస్తున్న ఈ వైద్యుడిని బీ ఆర్ డీ కాలేజ్ ఆసుపత్రి నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఆ ఉదంతం యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది.  తాజాగా ఈయనపై హిస్టరీ షీట్ తెరవడంతో ఇక ఎప్పుడూ ఇతనిపై పోలీసు నిఘా ఉంటుంది.

2019 డిసెంబరులో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న  కఫీల్ ఖాన్ సీసీఏ కి వ్యతిరేకంగా రెచ్ఛగొట్టే ప్రసంగం చేశాడన్న ఆరోపణపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. కొన్ని నెలల పాటు  జైలు  శిక్ష అనుభవించి బెయిల్ పై బయటికొచ్చారు.  అయితే నిన్న ఈ డాక్టర్ ఓ వీడియో మెసేజ్ విడుదల చేస్తూ తమపై హిస్టరీ షీట్ తెరిచారని, ఇక జీవితాంతం తనను పోలీసులే రక్షిస్తారని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. కనీసం ఫేక్ కేసుల నుంచి నన్ను ఇద్దరు పోలీసు గార్డులు కాపాడుతూ ఉంటారని ఆశిస్తున్నా అన్నాడు. యూపీలో ఒక డాక్టర్ పై హిస్టరీ షీట్ తెరవడం ఇదే మొదటిసారి.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?