మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పెట్రోల్ పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పెరుగుదల…

సామాన్యుడి నిత్యావసర వస్తువు మండుతోంది. ధర పెరుగుదల తగ్గకపోగా... రోజు రోజు పైపైకిపోతూ... వినియోగదారుడుకి చుక్కలు చూపెడుతోంది.

  • Gandu Raju
  • Publish Date - 3:58 pm, Wed, 9 December 20
మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పెట్రోల్ పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పెరుగుదల...

High taxes adding fire to fuel as prices rise సామాన్యుడి నిత్యావసర వస్తువు మండుతోంది. ధర పెరుగుదల తగ్గకపోగా… రోజు రోజు పైపైకిపోతూ… వినియోగదారుడుకి చుక్కలు చూపెడుతోంది.

వాహన చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలలో పెట్రోల్, డీజిల్ ధరలు పోటీపడుతూ వినియోగదారుడికి అందకుండా పరుగుపెడుతున్నాయి. తాజాగా ముంబై ధరల ప్రకారం పెట్రోల్ ధర లీటర్‌ రూ.90.34 పైసలు కాగా, డీజిల్ ధర రూ.80.51పైసలు అయ్యింది. ఈ ధరల పెరుగుదల స్థూలంగా వాటి మొత్తం ధరలో పెట్రోల్‌పై నాలుగు శాతం, డీజిల్‌పై 5 శాతం పెరుగుదల నమోదైంది.

 

కాగా, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధానం కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ ట్యాక్సే. గతంలో కంటే నవంబర్ 19 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై రూ.13, డీజిల్ పై రూ.16 అదనంగా ట్యాక్స్ రూపంలో వసూలు చేయడంతో చమురు ధరలు అలా అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ మారక ద్రవ్య విలువలు పడిపోవడమూ చమురు ధరల పెరుగుదలకు కారణం అవుతాయి.