‘జోహార్ టీజర్’ రిలీజ్ చేసిన హీరో వరుణ్ తేజ్..

'జోహార్ టీజ‌ర్'‌ను రిలీజ్ చేశాడు టాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ తేజ్‌. కాగా ఆగ‌స్ట్ 14న 'ఆహా ఓటీటీ యాప్'‌లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. పొలిటిక‌ల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్‌’ చిత్రం. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం..

'జోహార్ టీజర్' రిలీజ్ చేసిన హీరో వరుణ్ తేజ్..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 7:33 PM

‘జోహార్ టీజ‌ర్’‌ను రిలీజ్ చేశాడు టాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ తేజ్‌. కాగా ఆగ‌స్ట్ 14న ‘ఆహా ఓటీటీ యాప్’‌లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. పొలిటిక‌ల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్‌’ చిత్రం. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాను సందీప్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొద‌టి పోస్ట‌ర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్ర‌శంస‌లు పొందింది జోహార్ చిత్రం.

కాగా అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ’ఆహా’ అని పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ‘జోహార్’ చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్‌లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి.

Read More:

ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూత‌

ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..