మన హీరోలను కాపాడుకుందాం: సిద్ధార్థ్‌

చెన్నై: వివిధ సామాజిక సమస్యలపై స్పందిస్తూ, తన అభిప్రాయాన్ని వెల్లడించే వ్యక్తుల్లో కథానాయకుడు సిద్ధార్థ్‌ ఒకరు. ఉగ్రోన్మాదానికి 40మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన ఘటనపై సిద్ధార్థ్‌ తనదైన శైలిలో స్పందించారు. అస్థిరత్వానికి, నమ్మద్రోహానికి పాకిస్థాన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా అభివర్ణించారు. పుల్వామా ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..  ‘‘తప్పులపై తప్పులు చేస్తూ, అస్థిరత్వ, నమ్మక ద్రోహి అయిన పొరుగు దేశం పాకిస్థాన్‌ను లాకౌట్‌ చేయడం ఎందుకంత కష్టం? వారితో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని బంధాలను తెంచుకోండి. అంతర్జాతీయ సమాజం ముందు సమస్యను ఉంచి […]

మన హీరోలను కాపాడుకుందాం: సిద్ధార్థ్‌
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:06 PM

చెన్నై: వివిధ సామాజిక సమస్యలపై స్పందిస్తూ, తన అభిప్రాయాన్ని వెల్లడించే వ్యక్తుల్లో కథానాయకుడు సిద్ధార్థ్‌ ఒకరు. ఉగ్రోన్మాదానికి 40మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన ఘటనపై సిద్ధార్థ్‌ తనదైన శైలిలో స్పందించారు. అస్థిరత్వానికి, నమ్మద్రోహానికి పాకిస్థాన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా అభివర్ణించారు.

పుల్వామా ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..  ‘‘తప్పులపై తప్పులు చేస్తూ, అస్థిరత్వ, నమ్మక ద్రోహి అయిన పొరుగు దేశం పాకిస్థాన్‌ను లాకౌట్‌ చేయడం ఎందుకంత కష్టం? వారితో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని బంధాలను తెంచుకోండి. అంతర్జాతీయ సమాజం ముందు సమస్యను ఉంచి ప్రపంచాన్ని మనవైపు నిలబడేలా చేయండి. మన హీరోలను కాపాడండి’’ అని అన్నారు.

పుల్వామా దాడి జరిగిన వెంటనే తీవ్రంగా ఖండించిన సిద్ధార్థ్‌ ఉగ్రదాడిలో బలైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆధారాల్లేకుండా భారత్‌ నిందలు వేస్తోందన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇమ్రాన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.