కెరీర్ పీక్స్ టైంలో.. ఆ దర్శకుడితో సినిమా చేస్తోన్న రామ్!

కెరీర్ పీక్స్ టైంలో.. ఆ దర్శకుడితో సినిమా చేస్తోన్న రామ్!

ఇప్పటికే 'రెడ్' సినిమాలో కూడా చేస్తున్నాడు రామ్. అయితే అనుకోకుండా లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లో ఖాళీగా టైమ్ పాస్ చేస్తోన్న రామ్.. తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట. 2008లో వచ్చిన 'రెడీ' సినిమా అప్పట్లో..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 3:21 PM

ఈ మధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’‌ సినిమాతో ఎనర్జిట్ స్టార్ హీరో రామ్ సూపర్ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే కదా. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్మకత్వం వహించగా.. ఒకప్పటి హీరోయిన్ ఛార్మీ నిర్మాతగా వ్యవహరించింది. ‘ఇస్మార్ట్ శంకర్’‌ హిట్ కావడంతో.. ఇప్పటికే దానికి సీక్వెల్‌ కూడా ప్లాన్ చేస్తున్నట్లు పూరీ ప్రకటించాడు. కాగా అలాగే తన నాలుగు సినిమాలతో అటు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి దుబ్బు లేపాడు రామ్.

అలాగే ఇప్పటికే ‘రెడ్’ సినిమాలో కూడా చేస్తున్నాడు రామ్. అయితే అనుకోకుండా లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లో ఖాళీగా టైమ్ పాస్ చేస్తోన్న రామ్.. తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట. 2008లో వచ్చిన ‘రెడీ’ సినిమా అప్పట్లో మంచి హిట్ అందుకుంది. దానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ సినిమాకి శ్రీనువైట్ల సీక్వెల్ ప్లాన్ చేశారట. అలాగే ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌తో.. పూర్తి కామెడీతో స్క్రిప్టుని రెడీ చేసినట్లు సమాచారం. దీనికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తోంది. అయితే గత ఆరేళ్లుగా వరుస డిజాస్టర్స్‌తో ఉన్న శ్రీనువైట్లతో సినిమా అంటే కెరీర్ పరంగా పెద్ద రిస్కే అని రామ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి వీరిద్దరి కాంబో మళ్లీ సెట్ అవుతుందో లేదో.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu