Balakrishna: గన్నవరం విమానాశ్రయంలో బాలయ్య సందడి.. ఫొటోలు దిగేందుకు పోటీపడిన ఫ్యాన్స్‌..

వందకోట్ల కలెక్షన్లను రాబట్టి విజయోత్సాహంలో ఉన్న 'అఖండ' టీం తమ ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో పర్యటిస్తోంది.

Balakrishna: గన్నవరం విమానాశ్రయంలో బాలయ్య సందడి..  ఫొటోలు దిగేందుకు పోటీపడిన ఫ్యాన్స్‌..
Follow us

|

Updated on: Dec 14, 2021 | 9:16 PM

వందకోట్ల కలెక్షన్లను రాబట్టి విజయోత్సాహంలో ఉన్న ‘అఖండ’ టీం తమ ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో పర్యటిస్తోంది. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో సందడి చేశారు. ఆయన వెంట దర్శకుడు బోయపాటి శీను కూడా ఉన్నారు. మొదట హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వీరు అక్కడి నుంచి కారులో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కాగా బాలకృష్ణ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలయ్యతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు.

కాగా ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’. డిసెంబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇటీవలే వందకోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో కొవిడ్‌తో స్తబ్ధుగా ఉన్న ఇండస్ట్రీలో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ఓవర్సీస్‌ లోనూ ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ రేట్లు తగ్గినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

Also Read:

Telugu Indian Idol – Aha OTT: : టాలెంటెడ్ సింగర్స్ కోసం ఆహా సరికొత్త ప్రయత్నం.. ఇండియన్ ఐడల్ ఇక పై తెలుగులో..

Shyam Singha Roy Trailer: శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాని..

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..