ఏపీ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు ఇవే!

ప్రస్తుతం శీతాకాలమైనా ఏపీలో మాత్రం హాట్‌ హాట్‌గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్‌ చర్చించింది. సచివాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతరం భేటీలో డిస్కర్షన్‌కి వచ్చిన అంశాలపై మీడియాతో మాట్లాడారు మంత్రి పేర్ని నాని. పలు ముఖ్యమైన అంశాలపై […]

ఏపీ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు ఇవే!
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 3:41 PM

ప్రస్తుతం శీతాకాలమైనా ఏపీలో మాత్రం హాట్‌ హాట్‌గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్‌ చర్చించింది. సచివాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతరం భేటీలో డిస్కర్షన్‌కి వచ్చిన అంశాలపై మీడియాతో మాట్లాడారు మంత్రి పేర్ని నాని. పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్‌లో చర్చించినట్టు.. వాటిని తప్పక అమలు పరుస్తామని మంత్రి పేర్ని నాని తెలియజేశారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు:

1) అమరావతిలో భూదందాపై న్యాయ నిపుణులతో చర్చ

2) ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం

3) ముఖ్యంగా సీఆర్‌డీఏలో జరుగుతోన్న అక్రమాలపై చర్యలు

4) పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

5) పంచాయితీరాజ్ ఎలక్షన్స్‌కు రిజర్వేషన్లు ఖరారు

6) ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

7) 108 ఆంబెలెన్స్ సర్వీసుల్లో ఎన్నో సమస్యల పునరుద్ధరణ

8) 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం

9) 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం

10) ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

11) మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు. రూ.11,900 కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి. విభజన చట్టంలో భాగంగా రూ.10,900 కోట్లతో రామయపట్నం పోర్టు

12) రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు

13) జీఎన్ రావు, బీసీజీ నివేదికల పరిశీలనకు కమిటీ

14) హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై నిర్ణయం

కాగా.. అవినీతి అంశాలపై కూడా కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు పేర్ని నాని తెలియజేశారు. పలు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్టు సబ్ కమిటీ నివేదిక అందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్ల పేరుతో భూములు కొన్నారని, రాజధాని ప్రకటనకు ముందు కొనుగోళలపై విచారణ చేస్తామన్నారు. పాపం పండే రోజువస్తే ఎవరూ దాక్కోలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి పేర్ని నాని.