తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న వాయుగుండం

తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు ముంచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా మారనుందనే సమాచారం తెలుగు రాష్టాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఒడిశాలోని ఉత్తర తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ.....

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న వాయుగుండం
Follow us

|

Updated on: Aug 20, 2020 | 2:52 PM

తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు ముంచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా మారనుందనే సమాచారం తెలుగు రాష్టాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఒడిశాలోని ఉత్తర తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పడనం కాస్తా.. కొద్ది గంటల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఒడిశా తీర ప్రాంతాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయి. రెండ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదే తరహాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరికి వరద ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.