భారీ వర్షాలు.. తెలంగాణలోని ఆ 9 జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుయాని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

  • Sanjay Kasula
  • Publish Date - 1:04 pm, Mon, 14 September 20
భారీ వర్షాలు.. తెలంగాణలోని ఆ 9 జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుయాని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

5.8 ఎత్తు వరకు షీర్‌ జోన్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో 9 జిల్లాలో రెండ్రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.