అర్థరాత్రి తీరం దాటనున్న ‘బుల్ బుల్’.. భారీ వర్షాలు కన్ఫామ్..!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపించే తుఫాన్‌ ముంచుకొస్తుంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్‌బుల్ పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్‌‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు విశాఖపట్టణం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ఇవాళ అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే […]

అర్థరాత్రి తీరం దాటనున్న 'బుల్ బుల్'.. భారీ వర్షాలు కన్ఫామ్..!
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 10:00 AM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపించే తుఫాన్‌ ముంచుకొస్తుంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్‌బుల్ పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్‌‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు విశాఖపట్టణం వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఈ తుఫాను ఇవాళ అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.