తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

తెలంగాణలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం లో 16.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజీద్ లో 15.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ లో 12.8 సెంటీమీటర్లు

  • Tv9 Telugu
  • Publish Date - 10:54 am, Mon, 17 August 20
తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

Heavy rain in Telangana: తెలంగాణలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం లో 16.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజీద్ లో 15.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ లో 12.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మంగపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో 8 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ అర్బన్, కరీంనగర్, కొమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రుతుపవనాలు దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం దశ, దిశ ఇప్పటివరకు తెలియరాలేదు. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read More:

సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!