వడగాడ్పలు తగ్గుముఖం..వానలదే ఇక ఆలస్యం

దశాబ్దాల నాటి రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉత్తర, పశ్చిమ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిన చేస్తున్న వేడిగాలుల నుంచి ఉపశమనం దొరికింది. రానున్న 3 రోజుల్లో వేడిగాలుల నుంచి...

వడగాడ్పలు తగ్గుముఖం..వానలదే ఇక ఆలస్యం
Follow us

|

Updated on: May 28, 2020 | 7:16 PM

దశాబ్దాల నాటి రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉత్తర, పశ్చిమ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిన చేస్తున్న వేడిగాలుల నుంచి ఉపశమనం దొరికింది. రానున్న 3 రోజుల్లో వేడిగాలుల నుంచి ఊరట లభించి సగటు ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ సహా ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం కొంతమేర కొనసాగే అవకాశముందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పడిపోయాయి. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని పాలం పదేళ్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. రాజస్థాన్‌లోని చురూ ప్రాంతంలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని పాలంలో వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ పగటి సమయంలో ఇళ్లు వీడి బయటకురావొద్దని హెచ్చరించింది. గురువారం నాటికి ఉష్ణోగ్రతలు తగ్గగా, శుక్రవారం నుంచి మరింత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ ఉత్తరాది ప్రజలకు ఊరటనిచ్చే సూచన చేసింది.

ఇదిలా ఉంటే ఉమ్‌పున్ తుఫాను బెంగాల్ మీదుగా తీరం దాటినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలను కుండపోత వర్షాలు కకావికలం చేస్తున్నాయి. ఇప్పటికే అసోంలో బ్రహ్మపుత్ర సహా దాని ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా రానున్న 48 గంటల్లో అసోం, మేఘాలయ రాష్ట్రాలు తీవ్ర, అతితీవ్ర వర్షసూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో సైతం తీవ్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పర్వత ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండగా, మైదాన ప్రాంతాల్లో వరదల ముప్పు కొనసాగుతోంది.

మరోవైపు భారతదేశానికి వర్షాలను మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేందుకు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు దోహదపడుతున్నాయని తెలిపింది. ఈ కారణంగా రుతుపవనాలు ఇప్పటికే మాల్దీవులు-కొమోరిన్ ప్రాంతానికి చేరుకోగా, బంగాళాఖాతంలో అండమాన్-నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ శాఖ గుర్తించింది. 48 గంటల్లో ఇవి మరింత చురుగ్గా ముందుకు కదిలి కేరళను కేరళ తీరాన్ని సమీపించే అవకాశముందని అంచనా వేసింది. రుతుపవనాలు, సానుకూల వాతావరణ పరిస్థితులతో అరేబియా సముద్రంలో రానున్న 3 రోజుల్లో అల్పపీడన ద్రోణులు ఏర్పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం నుంచి అరేబియా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పశ్చిమ అరేబియా తీరంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

– మహాత్మ కొడియార్

సీనియర్ జర్నలిస్టు, ఢిల్లీ

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్