‘సార్ మేము చనిపోతున్నాం’.. పోలీసులకు బాధితుడు ఫోన్ కాల్!

నిన్న తెల్లవారు జామున వైజాగ్‌లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన తెలుగు రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి వెలువడిన స్త్టెరిన్‌ విషవాయువు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. దాదాపు 516 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనలో తొలిసారిగా పోలీస్ […]

'సార్ మేము చనిపోతున్నాం'.. పోలీసులకు బాధితుడు ఫోన్ కాల్!
Follow us

|

Updated on: May 08, 2020 | 4:42 PM

నిన్న తెల్లవారు జామున వైజాగ్‌లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన తెలుగు రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి వెలువడిన స్త్టెరిన్‌ విషవాయువు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. దాదాపు 516 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ ఘటనలో తొలిసారిగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన ఓ యువకుడి ఆడియో బయటికి వచ్చింది. ‘సార్ మేము చనిపోతున్నాం.. గాలి ఆడట్లేదు. ఇక్కడ ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు వల్ల చనిపోతున్నాం’ అంటూ అరుణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వింటూ ఉంటే హృదయాన్ని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..