బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ విజృంభణ, కేంద్రం అప్రమత్తం, నేడు అత్యవసర సమావేశం, విమాన సర్వీసులకు బ్రేక్ ?

బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంపై ఇండియా ఆందోళన చెందుతోంది. దీనిపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ లోని కోవిడ్ 19 పై గల జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సోమవారం అత్యవసరంగా సమావేశమవుతోంది.

  • Umakanth Rao
  • Publish Date - 7:02 am, Mon, 21 December 20
బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ విజృంభణ, కేంద్రం అప్రమత్తం, నేడు అత్యవసర సమావేశం, విమాన సర్వీసులకు బ్రేక్ ?

బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంపై ఇండియా ఆందోళన చెందుతోంది. దీనిపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ లోని కోవిడ్ 19 పై గల జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సోమవారం అత్యవసరంగా సమావేశమవుతోంది. అనేక యూరప్ దేశాలు అప్పుడే బ్రిటన్ నుంచి వచ్ఛే విమానాలకు, అలాగే తమ దేశాల నుంచి అక్కడికి వెళ్లే విమానాలపై ఆంక్షలు విధించాయి. నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ వంటి దేశాలు యూకే విమానాలపై బ్యాన్ విధించాయి. ఇండియా కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. నేడు జరగనున్న జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశంలో మన దేశం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొత్త మ్యుటెంట్ కరోనా వైరస్ పై చేతులెత్తేసిన బ్రిటన్, ఇది అదుపు తప్పుతోందని అంటూ నిన్నటి నుంచే దేశంలో.. ముఖ్యంగా ఇంగ్లండ్ లో లాక్ డౌన్ విధించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆరోగ్య శాఖలోని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రో డెరికో ఓఫ్రిన్ కూడా పాల్గొనే  అవకాశాలున్నాయి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ఈ గ్రూప్ లో రో డెరికో సభ్యుడు కూడా..ఇక సౌతాఫ్రికాలో తలెత్తిన కొత్త కరోనా వైరస్ పై ఇటలీవంటి   దేశాలు ఆందోళన చెందుతున్నాయి.  అక్కడి నుంచి వచ్ఛే విమానాలపై బ్యాన్ విధించే యోచన చేస్తున్నాయి. మ్యుటెంట్ కరోనా వైరస్  ప్రపంచ శాస్త్రజ్ఞులను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే సాధారణ వైరస్ ను అదుపు చేయగలుగుతున్నామని భావిస్తుండగా ఈ మ్యుటెంట్ వైరస్ సరికొత్త సవాళ్ళను విసరడం వారిని అయోమయానికి గురి చేస్తోంది.