ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ కోర్టుకు న‌వ దంప‌తులు…వారికే తిరిగి 10 వేల ఫైన్

వారు ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెద్ద‌ల‌ను నుంచి హెచ్చ‌రిక‌లు ఉండ‌టంతో.. రక్షణ కల్పించాలంటూ పంజాబ్​- హ‌ర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నవ దంపతులకు రూ.10 వేల ఫైన్ వేసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 1:12 pm, Wed, 3 June 20
ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ కోర్టుకు న‌వ దంప‌తులు...వారికే తిరిగి 10 వేల ఫైన్

వారు ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెద్ద‌ల‌ నుంచి హెచ్చ‌రిక‌లు ఉండ‌టంతో.. రక్షణ కల్పించాలంటూ పంజాబ్​- హ‌ర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నవ దంపతులకు రూ.10 వేల ఫైన్ వేసింది. ఈ ఘ‌ట‌న చండీగఢ్​​లో​ జరిగింది. అనంతరం వారికి రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించింది ధ‌ర్మాస‌నం.

అస‌లు ఏం జ‌రిగిందంటే…

గురుదాస్​పుర్​కు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకారం ద‌క్క‌లేదు. పైగా అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన ఆ జంట‌.. తమకు రక్షణ కల్పించాలంటూ మే 23న గురుదాస్​పుర్ ఎస్పీని క‌లిసి విన్న‌వించుకున్నారు. అనంతరం హైకోర్టులోనూ తమ పెళ్లి రోజు దిగిన ఫోటోలను ప్రూఫులుగా పిటిషన్​ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఆ ఫోటోల‌ను పరిశీలించిన హైకోర్టు… పెళ్లి సమయంలో వేడుకకు హాజరైన బంధుమిత్రులు, దంపతులు మాస్క్​లు ధరించలేదని గుర్తించి.. వారికి రూ. 10 వేల ఫైన్ క‌ట్టాల‌ని ఆదేశించింది. అనంతరం న‌వ దంపతులకు రక్షణ కల్పించాలని స్థానిక‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.