నాకో వధువు కావాలి..వయస్సు జస్ట్ 63 ఏళ్లు…

ఒంటిరి జీవితం మరీ దుర్బరంగా ఉంది. జీవిత భాగస్వామి లేక లైఫ్‌ అంతా బోర్‌ అయిపోయింది. వధువు కోసం వెతికి, వెతికి కాళ్లు అరిగిపోయాయి…ఒళ్లు హూనమైపోయింది. ఆ వెతుకులాటలోనే 40 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇంక ఎలాగూ మిగిలింది వృద్దాప్యమే కాబట్టి కృష్ణా, రామా అంటూ కాలం వెళ్లదీయాలి. కానీ వయసులో పంచాయితీ ఆఫీసుకు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే..ఆశ్చర్యపోవడం అక్కడ సిబ్బంది వంతైయ్యింది. వివరాల్లోకి వెళ్తే..63 ఏళ్ల పెళ్లికాని వ్యక్తి ఇప్పుడు […]

నాకో వధువు కావాలి..వయస్సు జస్ట్ 63 ఏళ్లు...

ఒంటిరి జీవితం మరీ దుర్బరంగా ఉంది. జీవిత భాగస్వామి లేక లైఫ్‌ అంతా బోర్‌ అయిపోయింది. వధువు కోసం వెతికి, వెతికి కాళ్లు అరిగిపోయాయి…ఒళ్లు హూనమైపోయింది. ఆ వెతుకులాటలోనే 40 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇంక ఎలాగూ మిగిలింది వృద్దాప్యమే కాబట్టి కృష్ణా, రామా అంటూ కాలం వెళ్లదీయాలి. కానీ వయసులో పంచాయితీ ఆఫీసుకు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే..ఆశ్చర్యపోవడం అక్కడ సిబ్బంది వంతైయ్యింది.

వివరాల్లోకి వెళ్తే..63 ఏళ్ల పెళ్లికాని వ్యక్తి ఇప్పుడు ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. తన కోసం ఒక అమ్మాయిని కనుగొనమని కోరుతూ గ్రామ పంచాయతీకి ఒక దరఖాస్తును అందజేశాడు. ఈ సంఘటన హవేరి జిల్లాలోని హంగల్ తాలూకాలోని నరేగల్ గ్రామంలో జరిగింది. హౌసింగ్ స్కీమ్ కింద నివాసాలకు, ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలకు దరఖాస్తులు తీసుకునే పంచాయతీ అధికారులకు, వృద్ధుడికి వధువును కనుగొనడానికి ఒక అభ్యర్థనను అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఈ వార్త అస్సలు కల్పన కాదు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, పంచాయతీ అభివృద్ధి అధికారికి ఇచ్చిన దరఖాస్తులో.. ధ్యామన్న కమ్మర్ (63) తన సొంత కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరాడు. అతను దయామవ మందిరానికి పూజారి అని, అవివాహితుడనని, తగిన అమ్మాయి కోసం ఇప్పటివరకు చేసిన అన్వేషణ విఫలమైందని చెప్పాడు. “నాకు ఆహారం వండడానికి ఎవరూ లేరు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా పెళ్ళికి మీరు ఒక అమ్మాయిని వెతకాలి” అని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. అధ్యక్షుడు, పంచాయతీ అభివృద్ధి అధికారి దైమన్న దరఖాస్తును స్వీకరించి రసీదు ఇచ్చారు. కొంతమంది గ్రామ పంచాయతీ సభ్యులు కూడా ధ్యామన్న దరఖాస్తుపై సంతకం చేసి మద్దతు ఇచ్చారు.

Published On - 10:00 am, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu