బ్రేకింగ్, హర్యానాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, బిల్లు ఆమోదం
హర్యానాలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. నెలకు 50 వేల రూపాయల లోపు వేతనాలతో నాలుగింట మూడు వంతుల జాబ్స్ ను రిజర్వ్ చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అయితే ఏ కేటగిరీలోనైనా తగిన అభ్యర్థి లభించకపోతే జనరల్ కేటగిరీ కింద తీసుకోవచ్చునన్న క్లాజును కూడా […]
హర్యానాలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. నెలకు 50 వేల రూపాయల లోపు వేతనాలతో నాలుగింట మూడు వంతుల జాబ్స్ ను రిజర్వ్ చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అయితే ఏ కేటగిరీలోనైనా తగిన అభ్యర్థి లభించకపోతే జనరల్ కేటగిరీ కింద తీసుకోవచ్చునన్న క్లాజును కూడా ఇందులో చేర్చారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తామని గత ఏడాది అక్టోబరులో దుశ్యంత్ చౌతాలా నేతృత్వం లోని జేజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కూడా అయిన చౌతాలా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.