Harmanpreet Kaur: క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన హర్మన్​ప్రీత్.. అప్రతిహాతంగా 100 వన్డేల ప్రస్థానం

భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించారు. 100 వన్డే మ్యాచ్‌లు ఆడిన తాజా భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు.

Harmanpreet Kaur: క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన హర్మన్​ప్రీత్.. అప్రతిహాతంగా 100 వన్డేల ప్రస్థానం
Follow us

|

Updated on: Mar 07, 2021 | 3:22 PM

భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించారు. 100 వన్డే మ్యాచ్‌లు ఆడిన తాజా భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఆదివారం లక్నోలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌తో ఆమె ఈ అరుదైన ఫీట్ అందుకున్నారు. గతంలో ఈ మైలురాయిని మరో నలుగురు మహిళా క్రికెటర్లు చేరుకున్నారు. మిథాలీ రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116) కూడా ఈ ఘనత సాధించారు. కొనసాగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన  దక్షిణాఫ్రికా మహిళా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో  హర్మన్‌ప్రీత్ 41 బంతుల్లో 40 పరుగులు చేసి సునే లూస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ ఇన్సింగ్స్‌లో ఆమె 6 ఫోర్లు కొట్టారు.

భారత వన్డే వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 100 మ్యాచ్‌ల్లో 2,412 పరుగులు చేశారు. గతంలో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆమె ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. టి20 ఫార్మాట్‌లో, హర్మన్‌ప్రీత్ 114 మ్యాచ్‌ల్లో ఆడారు. యాదృచ్చికంగా ఆమె 100  టి20 మ్యాచ్‌ కూడా దక్షిణాఫ్రికాతో జరిగింది. ఈ ఫార్మాట్‌లో ఆమె అత్యధిక స్కోరు 103. ఐసిసి గతేడాది డిసెంబర్‌లో  ప్రకటించిన టి20  టీమ్ ఆఫ్ ది డికేడ్‌లో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు. పూనమ్ యాదవ్, అలిస్సా హీలీ, సోఫీ డెవిన్, సుజీ బేట్స్, మెగ్ లాన్నింగ్, స్టాఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, ఎల్లిస్ పెర్రీ, అన్య ష్రబ్‌సోల్, మేగాన్ షుట్ ఈ జట్టులోని ఇతర ఆటగాళ్ళు.

కరోనా వల్ల ఏడాది కాలంగా క్రికెట్​కు దూరంగా ఉన్న ఇండియా విమెన్స్ టీమ్.. ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టింది. 5 వన్డేల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ను లఖ్​నవూ వేదికగా  సౌతాఫ్రికాతో ఆరంభించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మిథాలీ సేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. అర్ధ సెంచరీ చేసిన మిథాలీ.. కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడింది.

Also Read:

ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..

షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడనున్న పాకిస్తాన్ యువ పేపర్.. పూర్తి వివరాలు ఇవిగో…