నేతన్నకు శుభవార్త… ఏపీలో ‘ఈ–మార్కెటింగ్‌’

నేతన్నకు శుభవార్త... ఏపీలో ‘ఈ–మార్కెటింగ్‌’

గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ఆన్ లైన్ అమ్మకాలపై...

Sanjay Kasula

|

Aug 08, 2020 | 6:12 PM

Handloom Textiles e-marketing in AP : గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది ఏపీ సర్కార్. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ఆన్ లైన్ అమ్మకాలపై ఫోకస్ పెట్టింది. కార్పోరేట్ కంపెనీల తరహాలో చేనేతను చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటోంది.

రాయలసీమ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండవ ఏడాది సాయం అందించింది. ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆప్కో వస్త్రాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది.

ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్‌ మెటీరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోకి అమ్మకాలు చేస్తోంది. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా, నేతన్న ఆర్థికంగా లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్‌ కల్పించనుంది.  ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ద్వారా దాదాపుగా 81,024 కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేసింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu