అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ…

ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు మూడు రోజుల్లో ఆయన గాయం పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు‌.

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ...
Follow us

|

Updated on: Jun 13, 2020 | 11:43 PM

ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు మూడు రోజుల్లో ఆయన గాయం పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు‌. ఎక్కువసేపు కారులో ప్రయాణించ‌డం వ‌ల్ల గాయం కాస్త పెద్ద‌దైంద‌ని వివ‌రించారు. ఇన్‍ఫెక్షన్ పెరిగితే మ‌రోసారి ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంద‌ని… అయితే 90 శాతం మేర మ‌రోసారి శ‌స్త్ర‌చికిత్స చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇన్‍ఫెక్షన్ తగ్గడానికి రెండు నుంచి మూడు రోజుల స‌మయం పడుతుందని పేర్కొన్నారు

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుుడును శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు… ఆయనను విజయవాడకు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి.. అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయన్ను గుంటూరు జీజీహెచ్​కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.