తెలంగాణలో కొలువుల జాతర మొదలు.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 865 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ యువతకు శుభవార్త. త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నియామకాలు కూడా చేపడుతున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:13 am, Thu, 24 December 20
తెలంగాణలో కొలువుల జాతర మొదలు.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 865 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ యువతకు శుభవార్త. త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నియామకాలు కూడా చేపడుతున్నారు. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 865 లెక్చరర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో త్వరలోనే అధికారులు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.