జడేజా మరో జాంటీ రోడ్స్..వాటే క్యాచ్ మ్యాన్..!

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు మెరుస్తాడో తెలీదు.  టీమ్‌ అంతా చేతులు ఎత్తేసిన దశలో అతడు మూడోకన్ను తెరుస్తాడు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయతీరాలకు చేరవేస్తాడు. అంతేకాదు ఫీల్డింగ్‌లోనూ భారత్‌కు అతడు పెద్ద ఎస్సెట్. మెరుపుతీగలా కదులుతూ మెస్మరైజ్ చేసే క్యాచ్‌లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ప్లేయర్.

జడేజా మరో జాంటీ రోడ్స్..వాటే క్యాచ్ మ్యాన్..!
Follow us

|

Updated on: Mar 01, 2020 | 10:27 PM

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు మెరుస్తాడో తెలీదు.  టీమ్‌ అంతా చేతులు ఎత్తేసిన దశలో అతడు మూడోకన్ను తెరుస్తాడు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయతీరాలకు చేరవేస్తాడు. అంతేకాదు ఫీల్డింగ్‌లోనూ భారత్‌కు అతడు పెద్ద ఎస్సెట్. మెరుపుతీగలా కదులుతూ మెస్మరైజ్ చేసే క్యాచ్‌లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ప్లేయర్. తాజాగా క్రైస్ట్​చర్చ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా తన బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలను మరోసారి చూపించాడు. కివీస్​ మొదటి ఇన్నింగ్స్​లో ఆ జట్టు కీలక ఆటగాళ్లు టేలర్​(15), గ్రాండ్​హోమ్​(26)లను పెవిలియన్​ చేర్చాడు. అంతేకాదు వాట్లింగ్​(0), వాగ్నర్​(21)ను ఔట్ చెయ్యడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భతమైన క్యాచులతో భారత అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.

ఒక దశలో న్యూజిలాండ్​ స్కోరు 177/8. క్రీజులో ఆల్​రౌండర్​ జేమిసన్,​ బౌలర్​ వాగ్నర్​‌లు ఉన్నారు. అప్పటికే  వీరిద్దరూ కలిసి 9వ వికెట్​కు 51 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడిని గూస్‌బంప్స్ ఇచ్చే క్యాచ్‌తో ఔట్ చేశాడు జడేజా. షమి వేసిన 76వ ఓవర్​ చివరి బంతిని వాగ్నర్​ స్క్వేర్​ లెగ్​ వైపు తరలించాడు. బంతి తనకంటే చాలా ఎత్తుగా వెళ్తోన్న క్రమంలో సూపర్ మ్యాన్‌లా పైకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు జడ్డూ. అందరూ ఆ బంతి ఫోర్ పోతుందని భావించిన దశలో..జడేజా ఒక్కసారిగా ఆశ్యర్యానికి గురిచేశాడు. వాగ్నర్​ నిర్ఘాంతపోయి..కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి : పెన్షన్ పంపిణీలో జాప్యం..ఇద్దరు గ్రామ వాలంటీర్లపై స్పాట్‌లో వేటు..