పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ శాతం పెంపు!

2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన లాభాల ఆధారంగా వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ నిర్ణయించినట్లు కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ వెల్లడించారు. ఈపీఎఫ్‌పై వడ్డీరేటును పెంచాలనే ప్రతిపాదనను […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:43 am, Wed, 25 September 19
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్... వడ్డీ శాతం పెంపు!

2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన లాభాల ఆధారంగా వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ నిర్ణయించినట్లు కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ వెల్లడించారు.

ఈపీఎఫ్‌పై వడ్డీరేటును పెంచాలనే ప్రతిపాదనను గత ఫిబ్రవరిలోనే చేశారు. అయితే ఇది ఆర్థికశాఖ ఆమోదం పొందాల్సి ఉంది. సెప్టెంబరు 19న ఆర్థికశాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో 2018-19 ఏడాదికి గానూ వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచారు. తాజా పెంపుతో దాదాపు ఆరు కోట్ల ఈపీఎఫ్‌ ఖాతాదారులు లబ్ధి పొందనున్నారు.