Telecom: ఇక నుంచి రెండేళ్ల పాటు డేటా నిల్వ చేయాలి.. టెలికాం కంపెనీలకు DOT ఆదేశం..

కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగం రికార్డులను రెండేళ్ల పాటు భద్రపరచాలని టెలికాం డిపార్ట్‌మెంట్ DOT టెలికామ్ కంపెనీలకు స్పష్టం చేసింది.

Telecom: ఇక నుంచి రెండేళ్ల పాటు డేటా నిల్వ చేయాలి.. టెలికాం కంపెనీలకు DOT ఆదేశం..
Telecom
Srinivas Chekkilla

|

Dec 24, 2021 | 9:04 PM

కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగం రికార్డులను రెండేళ్ల పాటు భద్రపరచాలని టెలికాం డిపార్ట్‌మెంట్ DOT టెలికామ్ కంపెనీలకు స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఈ గడువు ఒక సంవత్సరం ఉండేది. ఇప్పుడు రెండేళ్లకు పెంచింది. భద్రతా కారణాలరీత్యా ఈ వివరాలను రెండేళ్ల పాటు స్టోర్‌ చేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల తర్వాత టెలికాం విభాగం నుంచి ఎలాంటి అభ్యంతరాలు అందకపోతే వివరాలను తొలగించొచ్చని తెలిపింది.

లైసెన్స్ నెట్‌వర్క్‌లోని సంభాషణలకు సంబంధించి అన్ని కాల్ వివరాల రికార్డులు, ఇంటర్నెట్ IP వివరాల రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందని DoT సర్క్యులర్‎లో పేర్కొంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా లేదా రాష్ట్ర భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించింది.

టెలికమ్యూనికేషన్స్ రంగంలో పెద్ద మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.

Read Also.. EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారా.. అయితే ఈ పని వెంటనే చేయండి.. లేకుంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu