హెచ్ 1బి వీసాలన్నీ వీళ్లే పట్టేస్తున్నారు

అమెరికా ఇచ్చే H1 B వీసాల్లో ఎక్కువ శాతం దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్ ఉద్యోగులే తన్నుకుపోతున్నారు. ఈ రెండు సంస్థలు హెచ్‌ వన్‌ బీ వీసాలకు చేస్తున్న దరఖాస్తుల్లో 99 శాతం ఆమోద ముద్ర..

హెచ్ 1బి వీసాలన్నీ వీళ్లే పట్టేస్తున్నారు
Follow us

|

Updated on: Aug 29, 2020 | 8:53 PM

అమెరికా ఇచ్చే H1 B వీసాల్లో ఎక్కువ శాతం దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్ ఉద్యోగులే తన్నుకుపోతున్నారు. ఈ రెండు సంస్థలు హెచ్‌ వన్‌ బీ వీసాలకు చేస్తున్న దరఖాస్తుల్లో 99 శాతం ఆమోద ముద్ర పొందుతున్నాయి. నిపుణులైన భారతీయుల సేవలు తమకు అవసరమని, అందుకనే వారికి మంచి వేతనాలు కూడా చెల్లించాల్సి వస్తోందని సదరు సంస్థలు వివరణ ఇస్తున్నాయి. భారతీయులకు హెచ్‌ 1 బీ వీసాలు కష్టతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ గూగుల్, ఫేస్‌బుక్‌ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయ సాఫ్ట్ వేర్ నిఫుణులు మాత్రం ఆ వీసాలను తన్నుకు పోతుండటం విశేషం. మొత్తంగా ఫేస్‌బుక్, గూగుల్‌ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయుల్లో 16 శాతానికిపైగా హెచ్‌ వన్‌ బీ వీసాలు కలిగిన వారే కావడం విశేషం.