హెచ్1బీ వీసా హోల్డర్లకు గుడ్‌న్యూస్

హెచ్1బీ వీసా హోల్డర్లకు గుడ్‌న్యూస్

అమెరికాన్ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి.. వేచి చూస్తున్న హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు.. ఆయా నోటీసులపై స్పందించేందుకు 60 రోజుల గడువు ఇస్తున్నట్లు అమెరికన్ ప్రభుత్వం తెలియజేసింది.

Rajesh Sharma

|

May 02, 2020 | 4:09 PM

అమెరికాన్ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి.. వేచి చూస్తున్న హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు.. ఆయా నోటీసులపై స్పందించేందుకు 60 రోజుల గడువు ఇస్తున్నట్లు అమెరికన్ ప్రభుత్వం తెలియజేసింది. అంటే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన హెచ్1బీ వీసాదారులకు.. అందుకు అవసరమైన పత్రాలను సమర్పించుకునేందుకు 60 రోజుల పాటు వెసులుబాటు దొరికిన అన్నమాట.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని ఇమిగ్రేషన్ ఆఫీసులు మూత పడిన విషయం తెలిసిందే. దాంతో ఆల్రెడీ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించ లేక పోయిన వారు టెన్షన్ పడుతున్నారు. వీరందరి హెచ్1బీ వీసా గడువు త్వరలో ముగుస్తుందని చాలామంది ఆందోళన పడ్డారు. అయితే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసినవారు అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పించేందుకు 60 రోజుల పాటు అదనపు సమయాన్ని కల్పించింది అమెరికన్ ప్రభుత్వం.

అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెబుతున్న వివరాల ప్రకారం వీసా కొనసాగింపు తిరస్కరణ నోటీసు, విత్ డ్రా నోటీసు, రీజినల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ల ముగింపు నోటీసులు.. వంటి వాటి విషయంలో స్పందించడానికి ఈ అదనపు సమయం ఉపయోగపడుతుంది. తమ దేశంలో పనిచేస్తూ కరోనా నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నామని యు.ఎస్.సీ.ఐ.ఎస్. తెలిపింది.

కరోనా తాకిడితో అగ్రరాజ్యంలో పలు సంస్థలు తాత్కాలికంగా మూతపడటంతో ఈ సంవత్సరం జూన్ చివరిలోగా రెండు లక్షల మందికి పైగా ఎంప్లాయిస్ చట్టబద్ధమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణులు అంచనా వేశారు. వారిలో హెచ్1బీ వీసాదారులే 90 శాతం ఉంటారని లెక్క కట్టారు. నిబంధనల ప్రకారం వేతనాలు లేకుండా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఉన్న ఉద్యోగం కోల్పోతే రెండు నెలల్లో కొత్త ఉద్యోగంలో చేరాలి లేదా వీసా కేటగిరీని మార్చుకోవాలి. లేకపోతే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. అయితే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన ఆంక్షలు ఇతరులకు ఇబ్బందికరంగా మారాయని పలువురు అంచనా వేశారు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం వారికి చల్లని కబురు అందించిందని చెప్పాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu