దీపావళి ధమాకా.. 250 ఛానెల్స్ కేవలం రూ.200కే!

డీటీహెచ్ వినియోగదారుల్లో చాలామంది ఎక్కువగా ఉపయోగించేది డిష్ టివి. ఇప్పటివరకు దేశంలోనే అధిక సంఖ్యలో ఎక్కువ మంది దీనికి వాడుతుండగా.. కొద్దిరోజులుగా ఆ కౌంట్ తగ్గుతూ వచ్చింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. మార్కెట్‌లో ఉన్న కాంపిటీషన్.. అంతేకాక డిష్ టీవీ సెటప్ బాక్స్‌ల్లో తలెత్తున్న సమస్యల వల్ల ఈ సంస్థ కొద్దికాలంగా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించిన డిష్ టీవీ సంస్థ… వినియోగదారులు ఆ సమస్యలను […]

దీపావళి ధమాకా.. 250 ఛానెల్స్ కేవలం రూ.200కే!
Follow us

|

Updated on: Oct 26, 2019 | 3:01 PM

డీటీహెచ్ వినియోగదారుల్లో చాలామంది ఎక్కువగా ఉపయోగించేది డిష్ టివి. ఇప్పటివరకు దేశంలోనే అధిక సంఖ్యలో ఎక్కువ మంది దీనికి వాడుతుండగా.. కొద్దిరోజులుగా ఆ కౌంట్ తగ్గుతూ వచ్చింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. మార్కెట్‌లో ఉన్న కాంపిటీషన్.. అంతేకాక డిష్ టీవీ సెటప్ బాక్స్‌ల్లో తలెత్తున్న సమస్యల వల్ల ఈ సంస్థ కొద్దికాలంగా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది.

ప్రస్తుతం ఈ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించిన డిష్ టీవీ సంస్థ… వినియోగదారులు ఆ సమస్యలను ఎదురుకోక ముందే దీనికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఇందులో భాగంగా డీటీహెచ్ సంస్థ ఇటీవలే హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్‌ను కూడా జత చేసింది. దీపావళీ ఆఫర్ కింద పాత ధరలకే కొన్ని ఛానల్ ప్యాక్‌లను వినియోగదారులకు అందిస్తోంది. కొత్త ట్రాయ్ టారిఫ్ రావడంతో ఛానెల్ ప్యాక్ ధరలు అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వినియోగదారులకు అధిక ఛార్జీలు పడకుండా పాత ధరలకు డిష్ టీవీ అందించబోతోంది. మరోవైపు ఈ ధరలు కేవలం రెండేళ్ల సబ్స్క్రిప్షన్ వ్యవధి ఎంచుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తాయని ఆ సంస్థ తెలిపింది.

ఇక పండగ ఛానల్ ప్యాక్ వివరాలు ఎలా ఉన్నాయంటే..

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ SD ప్లాన్(24 నెలలు) – రూ.5,256(నెలకు రూ.219)

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ HD ప్లాన్(24 నెలలు) – రూ. 7,176 (రూ.299 నెలవారీ ధర)

ఫ్యామిలీ ఇంగ్లీష్ SD ప్యాక్(24 నెలలు) – రూ .7,800(నెలవారి ధర 325 రూపాయలు)

ఫ్యామిలీ ఇంగ్లీష్ HD ప్యాక్(24 నెలలు) – రూ.10,776 (రూ.449 నెలవారీ అద్దెతో)

ఫ్యామిలీ క్రికెట్ ప్యాక్ ఎస్‌డి ప్యాక్‌(24 నెలలు) – రూ.6,600 (నెలవారీ అద్దె 275 రూపాయలతో)

ఫ్యామిలీ క్రికెట్ హెచ్‌డి ప్యాక్ (24 నెలలు) – రూ.8,376 (రూ. 349 నెలవారి అద్దెతో) లభిస్తున్నాయి. ఈ ఛానల్ ప్యాక్‌లన్నీ 250 కన్నా ఎక్కువ ఛానెల్‌లను అందిస్తున్నాయి. రెండేళ్ల ధరల కోసం ఈ ఛానెల్ ప్యాక్‌ల ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మరోవైపు సెటప్ బాక్స్‌లను కూడా డిష్ టీవీ చౌకధరకు అందించనుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..