చిరు వ్యాపారులకు కేంద్రం పెద్ద శుభవార్త

లాక్ డౌన్ కారణంగా కుదేలైపోయిన వ్యాపారాలతో దివాళా తీసిన చిన్నా, చితకా వ్యాపారులకు కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆర్థిక ప్యాకేజీలో చిరు వ్యాపారులకు పెద్ద పీట వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తాజాగా స్మాల్ ట్రేడర్స్‌కు పెద్ద ఊరట నిచ్చింది.

చిరు వ్యాపారులకు కేంద్రం పెద్ద శుభవార్త
Follow us

|

Updated on: Jun 12, 2020 | 5:55 PM

లాక్ డౌన్ కారణంగా కుదేలైపోయిన వ్యాపారాలతో దివాళా తీసిన చిన్నా, చితకా వ్యాపారులకు కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆర్థిక ప్యాకేజీలో చిరు వ్యాపారులకు పెద్ద పీట వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తాజాగా స్మాల్ ట్రేడర్స్‌కు పెద్ద ఊరట నిచ్చింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మే, జూన్‌, జులై నెలలకు జీఎస్టీఆర్‌-3బీ ఫామ్‌లను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే వెసులుబాటును కల్పించింది. ఈ రకంగా ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్‌ లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా వెల్లడించారు.

జులై 6వ తేదీ వరకూ జీఎస్టీ రిటర్న్స్‌ను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులపై అపరాధ వడ్డీ ఉండదని, ఆ తర్వాత జీఎస్టీ రిటర్న్స్‌ను దాఖలు చేసే చిరు పన్ను చెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని, ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వర్తిస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని ఆమె ప్రకటించారు. పాన్‌ మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని వెల్లడించారు.

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??