నేనే గెలుస్తా, ఇవన్నీ ఫేక్ ఒపీనియన్ పోల్స్, ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడం తథ్యమని, ఇందులో సందేహం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఎలక్షన్స్ లో తన ఓటమి ఖాయమన్న ఒపీనియన్ పోల్స్ ని ఫేక్ అని ఆయన వ్యాఖ్యానించారు.

నేనే గెలుస్తా, ఇవన్నీ ఫేక్ ఒపీనియన్ పోల్స్, ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 12:34 PM

అమెరికా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడం తథ్యమని, ఇందులో సందేహం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఎలక్షన్స్ లో తన ఓటమి ఖాయమన్న ఒపీనియన్ పోల్స్ ని ఫేక్ అని ఆయన వ్యాఖ్యానించారు. వీటిని నమ్మరాదన్నారు. నార్త్ కెరొలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. తన ప్రత్యర్థి జో బైడెన్ అవినీతిజిపరుడని, అమెరికాను పాలించే అర్హత ఆయనకు లేదని అన్నారు. ఫేక్ ఒపీనియన్ పోల్స్ తో ఒరిగేదేమీ లేదు అన్నారు. తన మద్దతుదారులు తనకు అఖండ విజయం సాధించి పెడతారన్న ధీమాను ట్రంప్ వ్యక్తపరిచారు.

మరోవైపు జో బైడెన్,, ఇక తట్టాబుట్టా సర్దుకుని వెళ్లాలని ట్రంప్ ను ఉద్దేశించి హెచ్ఛరించారు. మీకు సమయం వచ్చిందని, అన్నీ ప్యాకప్ చేసుకుని ఇంటి ముఖం పట్టాలని తన ప్రచార ర్యాలీలో కోరారు. వైట్ హౌస్ ను ఖాళీ చేసే టైం వచ్చిందన్నారు .