న్యూయర్‌కి షాకిస్తోన్న బంగారం ధరలు! చివరి రోజు ఎంతంటే?

బంగారం ఈ మాట వింటే మహిళల మనసు ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. కానీ.. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. బంగారం ప్రియులకు షాకిస్తున్నాయి. […]

న్యూయర్‌కి షాకిస్తోన్న బంగారం ధరలు! చివరి రోజు ఎంతంటే?
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 2:14 PM

బంగారం ఈ మాట వింటే మహిళల మనసు ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. కానీ.. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. బంగారం ప్రియులకు షాకిస్తున్నాయి. 2019 మొదటి నెల జనవరిలో 30 వేలతో మొదలైన పసిడి ధర ఇప్పుడు సంవత్సరాంతానికి వచ్చే సరికి 40 వేలకు చేరింది.

తాజాగా ఈరోజు 40 వేల బెంచ్ మార్క్‌ని దాటి మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి బంగారం ధరలు. 2021కి వీటి ధరలు అరలక్షకి చేరుకున్నా షాక్‌ అవ్వాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40,220లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 37,270లుగా ఉంది.

కాగా.. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24కే 10 గ్రాముల పసిడి ధర రూ. 39,300లు అవ్వగా.. 22కే 10 గ్రాముల ధర రూ. 36,500లుగా ఉంది. ఇక చెన్నైలో 24కే 10 గ్రాముల ధర రూ. 40,690 కాగా.. 22కే 10 గ్రాముల ధర రూ. 37,300లుగా ఉంది. ముంబైలో 24కే 10 గ్రాముల ధర రూ. 38,950 కాగా.. 22కే 10 గ్రాముల ధర రూ. 37,950లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌ మార్కెట్లో‌ ప్రస్తుతం కిలో వెండి రూ. 49,350లుగా ఉంది. కాగా.. ఇక్కడ ఇవ్వబడిన ధరలు ఉదయం 7 గంటల వరకూ ఉన్నవి. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయంగా ఎప్పుడూ హెచ్చుతగ్గులకు గురవుతూంటాయి.