Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!

Gold Price Today: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి...

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
Gold Prices
Follow us

|

Updated on: Jun 11, 2022 | 5:32 AM

Gold Price Today: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా 10 గ్రాముల ధరపై స్వల్పంగా తగ్గింది. తులం బంగారంపై రూ.210 వరకు తగ్గింది. ఇక జూన్‌ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,100 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద నమోదైంది.

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1200 వరకు తగ్గుముఖం పట్టింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, ముంబైలో రూ.61,000 ఉంది, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, కోల్‌కతాలో రూ.61,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్‌ ధర రూ.67,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.67,000 ఉంది. ఇక కేరళలో రూ.67,000 ఉండగా, విజయవాడలో రూ.67,000 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి