Gold Investment: బంగారాన్ని వృధాగా లాకర్ లో ఉంచుతున్నారా? దానిని పెట్టుబడిగా పెట్టండి..ఆదాయం పొందండి.. ఎలా అంటే?

భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బంగారం విలువ, ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇది చాలా మంది భారతీయుల మనస్సులలో లోతుగా పాతుకుపోయింది.

Gold Investment: బంగారాన్ని వృధాగా లాకర్ లో ఉంచుతున్నారా? దానిని పెట్టుబడిగా పెట్టండి..ఆదాయం పొందండి.. ఎలా అంటే?
Gold Investment

Gold Investment: భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బంగారం విలువ, ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇది చాలా మంది భారతీయుల మనస్సులలో లోతుగా పాతుకుపోయింది. అందువల్ల, ఇటీవలి కాలంలో అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, సాంప్రదాయ-మనస్సు గల భారతీయులు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ప్రతి పండుగకు కొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు అలవారు. అయితే, ఈ బంగారం చాలా సంవత్సరాలు లాకర్‌లోనే ఉంటుంది. రీఫండ్ ఏమీ ఉండదు. అందువల్ల, బంగారంపై పెట్టుబడి పెట్టడం కొంత మేరకు చనిపోయిన పెట్టుబడి (డేడ్ ఇన్వెస్ట్మెంట్) గా పరిగణిస్టారు.

అయితే, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇంటి బంగారంపై డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది. PNB బ్యాంక్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో బంగారాన్ని ఉంచడం ద్వారా మీరు మంచి రాబడులను పొందవచ్చు.

కనీసం ఎంత బంగారం డిపాజిట్ చేయాలి?

దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నందున చాలామంది బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో ఉంచుతారు. దీని కోసం మీరు బ్యాంకుకు రుసుము చెల్లించాలి. అయితే, మీరు PNB బ్యాంక్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే, మీ బంగారు ఆభరణాల కోసం మీరు ప్రత్యేక బ్యాంక్ లాకర్‌ను కొనుగోలు చేయనవసరం లేదు. మీరు కూడా కొంత వడ్డీని స్వీకరిస్తూనే ఉంటారు. మీరు ఈ పథకంలో ఒక టన్ను బంగారాన్ని కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

PNB బ్యాంక్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో మూడు రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (STBD) లో మీరు గోల్డ్ బ్యాంక్‌లో 1 నుండి 3 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. మీడియం, లాంగ్ టర్మ్ గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ వ్యవధి వరుసగా 5 నుండి 7 సంవత్సరాలు అదేవిధంగా 12 నుండి 15 సంవత్సరాలు.

ఎంత వడ్డీ వస్తుంది?

PNB బ్యాంక్ పథకం ఒక సంవత్సరానికి 0.50 శాతం నుండి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు రెండు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధిలో, వడ్డీ రేటు 2.25 శాతం ఉంటుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల కాలానికి వడ్డీ 2.50 శాతం ఉంటుంది. గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్‌లో మీరు బంగారు నాణేలు, బ్రాస్‌లెట్‌లు, ఆభరణాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి, వినియోగదారులు దరఖాస్తు ఫారం, గుర్తింపు కార్డు, KYC జాబితా ఫారమ్‌ను పూరించాలి.

మీరు ఎప్పుడు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?

షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD) లో, మీరు మెచ్యూరిటీకి ముందు బ్యాంక్ నుండి బంగారాన్ని విత్‌డ్రా చేస్తే, మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏడాదిలోపు బంగారం విత్‌డ్రా చేస్తే, దానిపై మీకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఇది 0.15 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అలాగే, బంగారం డబ్బు రూపంలో లేదా బంగారం రూపంలో తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుపై లేదు.

మీడియం టర్మ్‌లో పెట్టుబడులు పెట్టే వారు ముందుగానే బంగారాన్ని ఉపసంహరించుకుంటే వడ్డీపై జరిమానా విధిస్తారు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడితో కూడా, మీరు ఎప్పుడూ మీ బంగారాన్ని ఐదేళ్ల తర్వాత తిరిగి పొందవచ్చు. అయితే, దానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా వ్యక్తి, సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ప్రైవేట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టవచ్చు.

Also Read: Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..

Reliance Jio: రిలయెన్స్ జియో సృష్టించిన డేటా విప్లవం.. ఇది ఐదేళ్ళ డిజిటల్ సంచలనం!

Click on your DTH Provider to Add TV9 Telugu