జర్నలిస్ట్ తేజ్ పాల్ కేసులో కొత్త ట్విస్ట్, నిర్దోషిగా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గోవా ప్రభుత్వం అప్పీలు

తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసులో కొత్త ట్విస్ట్ ! 2013 నాటి రేప్ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

  • Publish Date - 1:17 pm, Wed, 26 May 21 Edited By: Phani CH
జర్నలిస్ట్ తేజ్ పాల్ కేసులో కొత్త ట్విస్ట్, నిర్దోషిగా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గోవా ప్రభుత్వం అప్పీలు
Goa Govt. Challenges Acquittal Of Tarun Tejpal

తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసులో కొత్త ట్విస్ట్ ! 2013 నాటి రేప్ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. తరుణ్ తేజ్ పాల్ పై వచ్చిన అభియోగాలను ప్రభుత్వం తీవ్రమైనవిగా పరిగణించింది. 2013 నవంబరు 7 న గోవాలోని ఫైవ్ స్టార్ హోటల్ లో తనపై తేజ్ పాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించగా అదే ఏడాది నవంబరు 30 న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాగా 2014 జులై 1 న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గోవా క్రైమ్ బ్రాంచ్ ఆయనపై 2,846 పేజీల ఛార్జి షీట్ ను అదే ఏడాది ఫిబ్రవరిలో సిద్ధం చేసి కోర్టుకు సమర్పించింది. ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కోర్టులో విచారణ జరిగింది. 2018 మార్చి నెలలో ప్రాసిక్యూషన్ బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుంది. నాడు మొత్తం విచారణ రహస్యంగా సాగింది. 71 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, అయిదుగురు డిఫెన్స్ సాక్షులు తమ స్టేట్ మెంట్లను కోర్టులో వినిపించారు. చివరకు ఈ నెల 21 న గోవాలోని సెషన్స్ కోర్టు తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటించింది. పైగా తాజాగా ఈ కేసు దర్యాప్తులో ఎన్నో లోపాలున్నాయని పేర్కొంది.

కానీ ఈ ఉత్తర్వుల పట్ల గోవా ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. 2 వారాల్లో దీనిపై విచారణ జరుగుతుందని అడ్వొకేట్ జనరల్ దేవీదాస్ పంగామ్ తెలిపారు. సీఎం ప్రమోద్ సావంత్ కూడా దీనిపై స్పందిస్తూ తేజ్ పాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ  చూడండి: Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క…చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )

Fact Check: టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?