ఆకలి కేకలు పెడుతున్న భారత్..! పాక్, బంగ్లా కంటే దిగువకు..

అగ్రదేశాలతో పోటీ పడుతున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాలకు సంబంధించి 2019కి గాను జీహెచ్ఐ జాబితాను విడుదల చేసింది. దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని ఈ జాబితా తేల్చింది. పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌ ఈ లిస్ట్‌ను రూపొందించింది. 117 దేశాలతో కూడిన ఈ లిస్ట్‌లో భారత్‌.. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే […]

ఆకలి కేకలు పెడుతున్న భారత్..! పాక్, బంగ్లా కంటే దిగువకు..
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 11:36 PM

అగ్రదేశాలతో పోటీ పడుతున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాలకు సంబంధించి 2019కి గాను జీహెచ్ఐ జాబితాను విడుదల చేసింది. దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని ఈ జాబితా తేల్చింది. పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌ ఈ లిస్ట్‌ను రూపొందించింది.

117 దేశాలతో కూడిన ఈ లిస్ట్‌లో భారత్‌.. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన ఉంది. 117 దేశాలలో భారత్ 102వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో పాకిస్తాన్ 94వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 88, నేపాల్ 73వ స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలీస్తే భారత్‌ కేవలం ఒక స్థానం మాత్రమే మెరుగుపడింది. అయితే 2014లో 55వ స్థానంలో ఉండగా 2015లో 93వ స్థానానికి చేరింది. తాజాగా 102వ స్థానానికి చేరుకోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. అన్ని రంగాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాక్ సైతం 2019 ర్యాంకింగ్స్‌లో 94వ స్థానంలో నిలిచింది. గతేడాది 106వ స్థానంలో ఉన్న పాక్.. 12స్థానాలను మెరుగుపరుచుకోగలిగింది.

అయితే ప్రతి ఏటా జీహెచ్ఐ ఈ అధ్యయనం కోసం దేశాల సంఖ్యను మారుస్తుంటుంది.  2014లో మొత్తం 76 దేశాల్లో సర్వే చేయగా భారత్ 55వ ర్యాంకు దక్కించుకుంది. ఇక 2017లో 119 దేశాలతో లిస్ట్ ప్రిపేర్ చేయగా.. భారత్ 100వ స్థానంలో నిలిచింది. అదే విధంగా 2018లో 119 దేశాల్లో అధ్యయనం చేయగా 103వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 117 దేశాల్లో పరిశోధనలు చేపట్టి.. భారత్ 102వ స్థానంలో ఉన్నట్లు తేల్చింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ఆహార భద్రత,పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నా.. ఇంకా లక్ష్యాలను చేరలేదన్నది ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.