యాభై ఎకరాల పొలాన్ని పేకాటలో తగలెట్టాడు, చివరికి వ్యసనాన్ని వీడలేక దొంగగా మారి..

కూర్చుని తింటుంటేనే కొండలు కూడా కరిగిపోతాయి. అలాంటిది చెడు వ్యసనాలు కూడా ఉంటే ఎంత డబ్బు ఉన్నా అయిపోవడానికి పెద్దగా సమయం పట్టదు.

యాభై ఎకరాల పొలాన్ని పేకాటలో తగలెట్టాడు, చివరికి వ్యసనాన్ని వీడలేక దొంగగా మారి..
Follow us

|

Updated on: Dec 12, 2020 | 2:47 PM

కూర్చుని తింటుంటేనే కొండలు కూడా కరిగిపోతాయి. అలాంటిది చెడు వ్యసనాలు కూడా ఉంటే ఎంత డబ్బు ఉన్నా అయిపోవడానికి పెద్దగా సమయం పట్టదు. వ్యసనాలు మనిషిని ఎంతగా దిగజార్చుతాయో తెలుసుకోడానికి ఇప్పడు చెప్పబోయే ఘటనను పాఠంగా భావించొచ్చు. యాభై ఎకరాల ఆసామి అతను. ఇద్దరు పిల్లలు కూడా పెద్ద కొలువులు చేస్తున్నారు. చివరకు అతను మాత్రం దొంగగా మారాడు.

వివరాల్లోకి వెళ్తే…హైదరాబాద్‌ జెక్‌ కాలనీ క్లాసిక్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లోని 501 ఫ్లాట్‌లో ఆర్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగి శేషసాయి ప్రసాద్‌ దంపతులు నివసిస్తున్నారు. వీరు గత నెలలో తమ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా లక్కవరం గ్రామానికి వెళ్లారు. నవంబరు 20న ఉదయం 11 గంటలకు వారి ఇంట్లో చోరి జరిగింది. ఫ్లాట్‌ గొళ్లెం పగులగొట్టి ఇంట్లోకి వచ్చిన దొంగ బీరువాలో దాచిన 35 తులాల బంగారం, రెండు కేజీల వెండి వస్తువులను తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. చోరీపై అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సీసీ ఫుటేజీలో నిందితుడి ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. నిందితుడిని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన రాయపాటి వెంకట్రావుగా నిర్ధారించారు. దీంతో శుక్రవారం గుంటూరు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడి పూర్తి సమాచారం తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు. వెంకట్రావుకు అమరావతి దగ్గర్లో 50 ఎకరాల పొలం ఉందట. అది కూడా ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతుందట. అయితే పేకాట వ్యసనంగా మారడంతో పొలం అమ్మి మరీ ఆట ఆడాడు. పొలాన్ని విడతల వారీగా విక్రయించి ఆ సొమ్మునంతా పేకాటలో పోగొట్టుకున్నాడు. అయినా పేకాటను వదిలిపెట్టలేక చివరకు చోరీలకు అలవాటుపడ్డాడు.ఈ క్రమంలో హైదారాబాద్‌లో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు.

Also Read :Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే