Free Credit Report: మీ క్రెడిట్‌ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవాలా..? ఉచితంగా తెలుసుకోవచ్చు..!

Free Credit Report ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకులు కూడా చాలా మందికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే ఏదైనా రుణాల..

Free Credit Report: మీ క్రెడిట్‌ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవాలా..? ఉచితంగా తెలుసుకోవచ్చు..!
Follow us

|

Updated on: Dec 26, 2021 | 2:23 PM

Free Credit Report ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకులు కూడా చాలా మందికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే ఏదైనా రుణాల కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకుంటే ముందు క్రెడిట్‌ స్కోర్‌ను చూస్తుంటారు. ఆ స్కోర్‌ను బట్టి బ్యాంకులు రుణాలను అందిస్తుంటాయి. క్రెడిట్‌ కార్డులు వాడేవారు సమయానికి గడువులోగా వాడుకున్న బిల్లును చెల్లిస్తే కార్డు చరిత్ర అనేది బాగుంటుంది. సమయానికి బిల్లు చెల్లించకుంటే సిబిల్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. దీంతో రుణాలు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంటుంది. అదే క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే రుణాలను ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తుంటాయి బ్యాంకులు. ఒక వేళ రుణం ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాహనాల రుణాలు, ఏదైనా బిజినెస్‌ నిమిత్తం, వ్యక్తిగత రుణాలలో ఈ క్రెడిట్‌ స్కోర్‌ కీలక పాత్ర పోషిస్తుంటుంది. అయితే క్రెడిట్‌ స్కో్‌ర్‌ రిపోర్టును తెలుసుకోవాలంటే కొన్ని బ్యాంకులు ఉన్న స్కోర్‌లో కొన్ని పాయింట్లను తగ్గిస్తుంటాయి. కానీ ఉచితంగా కూడా క్రెడిట్‌ స్కోర్‌ను చూసుకునే సౌలభ్యం ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు రిపోర్టు తెలుసుకోవాలంటే ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హైమార్క్‌ వంటి స్కోర్‌ రిపోర్టు అందించే కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ స్కోర్‌ తెలుసుకోవాలనేవారికి ఏడాదికోసారి ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ రిపోర్టు అందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు చెబుతున్నాయి. పలు కంపెనీలు ఫిన్‌టెక్‌ కంపెనీలు, అంటే పేటీఎం, అమెజాన్‌ పే, క్రెడ్‌, ఈటీసీ ఆయా కంపెనీలతో టై-అప్‌ అయ్యి ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను అందిస్తున్నాయి. జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య మీరు క్రెడిట్‌ రిపోర్టును ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా స్కోర్‌ రిపోర్టు తీసుకోకుంటే డిసెంబర్‌ 31లోగా మీ రిపోర్టును ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కోర్‌ను పొందేందుకు పుట్టిన తేదీ, పాన్‌, ఆధార్‌ వివరాలను అందించాల్సి ఉంటుంది. అందులో ఎంత స్కోర్‌ ఉంటుందనే విషయం తెలుస్తుంది.

క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవాలి.. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే పెంచుకునేందుకు కూడా మార్గాలుంటాయి. మీరు క్రెడిట్‌ కార్డు, లోన్‌ మొత్తాన్ని సమయానుకూలంగా చెల్లిస్తూ ఉండాలి. ఆలస్యంగా చెల్లిస్తున్నట్లయితే మీ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్‌ కార్డులను ఎక్కువ వాడేవారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గడువులోగా వాడిన బిల్లును చెల్లిస్తుంటే స్కోర్‌ బాగుంటుంది. స్కోర్‌ తక్కువగా ఉంటే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో దాని ప్రభావం ఉంటుంది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకుంటే అప్పుతో పాటు మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా తగ్గుతుంటుంది. అవసరానికి తగినట్లుగా ఖర్చు చేస్తుండాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఎడపెడా వాడితే ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి:

Year Ender 2021: ఈ సంవత్సరంలో విడుదలైన టాప్‌ – 9 ఎలక్ట్రిక్‌ కార్లు.. ఫీచర్స్‌, ధర వివరాలు

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన