దేశక్షేమం కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న ప్రధానమంత్రి

కరోనా వైరస్‌ కనుమరుగయ్యేంత వరకు శుభలగ్నాల జోలికి వెళ్లకపోవడమే బెటరనేది కొందరు పంచాంగకర్తల తాజా వాక్కు! ఈ దుర్ముహూర్త కాలంలో పెళ్లిళ్లు గ్రటాలు చేసుకోకపోవడమే మంచిదని నొక్కి వక్కాణిస్తున్నారు. అందుకే మాఘమాసంలోనూ ఎక్కడా సన్నాయి మోగలేదు.. పెళ్లి మంత్రాలు వినిపించలేదు.. సరే.. నిబంధనల మేరకు చేసుకున్నవారు చేసుకున్నారు.. ఆర్భాటాలకు వెళ్లినవారూ ఉన్నారు.. ఇది మన దేశపరిస్థితి.. మిగతా చోట్ల అలాకాదు.. ఆంక్షలంటే ఆంక్షలే! ప్రధానమంత్రి అయినా మామూలు ప్రజలైనా ఒకే రూలు.. జవదాటడానికి వీల్లేదు.. ఈ కారణం […]

  • Balu
  • Publish Date - 3:17 pm, Fri, 26 June 20
దేశక్షేమం కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న ప్రధానమంత్రి

కరోనా వైరస్‌ కనుమరుగయ్యేంత వరకు శుభలగ్నాల జోలికి వెళ్లకపోవడమే బెటరనేది కొందరు పంచాంగకర్తల తాజా వాక్కు! ఈ దుర్ముహూర్త కాలంలో పెళ్లిళ్లు గ్రటాలు చేసుకోకపోవడమే మంచిదని నొక్కి వక్కాణిస్తున్నారు. అందుకే మాఘమాసంలోనూ ఎక్కడా సన్నాయి మోగలేదు.. పెళ్లి మంత్రాలు వినిపించలేదు.. సరే.. నిబంధనల మేరకు చేసుకున్నవారు చేసుకున్నారు.. ఆర్భాటాలకు వెళ్లినవారూ ఉన్నారు.. ఇది మన దేశపరిస్థితి.. మిగతా చోట్ల అలాకాదు.. ఆంక్షలంటే ఆంక్షలే! ప్రధానమంత్రి అయినా మామూలు ప్రజలైనా ఒకే రూలు.. జవదాటడానికి వీల్లేదు.. ఈ కారణం వల్లే డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడ్రిక్‌సన్‌ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్నది.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ క్షేమం కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నారామె! తనకు కాబోయే భర్త ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫ్రెడ్రిక్‌సన్‌ ..ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాననీ, కాకపోతే అదంత ఈజీగా అనిపించడం లేదనీ క్యాప్షన్‌ ఇచ్చుకున్నారు. నిజానికి వీరి వివాహం జులైలో జరగాలి.. కాకపోతే వారిద్దరు పెళ్లి చేసుకుందామనుకున్న రోజునే ప్రధాని బ్రస్సెల్స్‌లో జరిగే ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. డెన్మార్క్‌ శ్రేయస్సును ఆకాంక్షించే ప్రధానమంత్రి పెళ్లిని పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు.. కర్తవ్య నిర్వహణలో పడ్డారు.. బెల్జియం రాజధాని అయిన బ్రస్సెల్స్‌లో వచ్చే నెల 17, 18 తేదీలలో యూరోపియన్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరుగబోతున్నది.. ఈ సమావేశంలో యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల నేతలు పాల్గొనబోతున్నారు. సమావేశం అంటే వీడియో కాన్ఫరెన్స్‌ అన్నమాట! ఈ కీలక భేటీలో కొత్త నూతన యూరోపియన్‌ యూనియన్‌ బడ్జెట్‌, కరోనా వైరస్‌ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తారు . దేశ శ్రేయస్సు కోసం ..ప్రజల క్షేమం కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్న ప్రధానమంత్రిని చూసి డెన్మార్క్‌ ప్రజలు పొంగిపోతున్నారు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.