ఆధిపత్యం కోసం పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే భయంకర విన్యాసం

ఇండోనేసియా లో బల్లి జాతికి చెందిన కొమొడోల భయంకర పోరాటం చూసి ఓ టూరిస్టు తన కెమెరాకు పని చెప్పాడు. అక్కడి కొమొడోల నేషనల్ పార్కును విజిట్ చేసిన ఇతనికి నాలుగు కొమొడోలు కనిపించాయి.

ఆధిపత్యం కోసం పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే భయంకర విన్యాసం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 26, 2020 | 6:15 PM

ఇండోనేసియా లో బల్లి జాతికి చెందిన కొమొడోల భయంకర పోరాటం చూసి ఓ టూరిస్టు తన కెమెరాకు పని చెప్పాడు. అక్కడి కొమొడోల నేషనల్ పార్కును విజిట్ చేసిన ఇతనికి నాలుగు కొమొడోలు కనిపించాయి.  వెనుక కాళ్ళపై నిలబడితే సుమారు 8 లేదా 9 అడుగుల ఎత్తున కనిపించే ఈ రాక్షస జీవులు ఉన్నట్టుండి పోరాటానికి దిగాయి. ఈ పోరాటంలో రెండు తమ ‘ప్రత్యర్థుల ధాటికి’ ఆగలేక కింద పడిపోగా.. మరో రెండు మాత్రం భీకర ఫైట్ కి దిగాయి. దాదాపు 10 నిముషాల సేపు జరిగిన ఈ పోరాటంలో చివరకు తొమ్మిది అడుగుల ఎత్తున ఉన్నట్టు కనిపించిన కొమొడో విజయం సాధించింది. అత్యంత బరువైన ఇవి జింకలను వేటాడుతాయని జంతు నిపుణులు చెబుతున్నారు.  సాధారణంగా మేటింగ్ సమయంలో కానీ, ఒక ప్రాంతం మీద తమ ఆధిపత్యం కోసం కానీ ఇవి పోరాడుతుంటాయట. ఎక్కువగా సినిమాల్లో చూసే ఇలాంటి సన్నివేశాలు రియల్ గా కనబడేసరికి ఆ టూరిస్టు థ్రిల్ అయిపోయాడు.