వైరల్‌గా మారిన వరల్డ్ ఫేమస్ లవర్ 4 హీరోయిన్స్ లుక్స్

విజయ్ దేవరకొండ అలియాస్ రౌడి.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు అర్జున్ రెడ్డి. తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు మనోడు. డియర్ కామ్రెడ్ సినిమా తర్వాత విజయ్ చేస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్‌కి తక్కువ వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవరకొండతో జోడీగా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ రాశీ ఖన్నా, ఇజబెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్‌లు నటిస్తున్నారు. కాగా.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:24 am, Mon, 16 December 19
వైరల్‌గా మారిన వరల్డ్ ఫేమస్ లవర్ 4 హీరోయిన్స్ లుక్స్

విజయ్ దేవరకొండ అలియాస్ రౌడి.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు అర్జున్ రెడ్డి. తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు మనోడు. డియర్ కామ్రెడ్ సినిమా తర్వాత విజయ్ చేస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్‌కి తక్కువ వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవరకొండతో జోడీగా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ రాశీ ఖన్నా, ఇజబెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్‌లు నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా.. సినిమాలో ఈ హీరోయిన్స్‌ పేర్లను కూడా తెలిపింది చిత్రబృందం. సువర్ణగా ఐశ్వర్య రాజేష్, చెరియా అలియాస్ ఇజబెల్లె, స్మితా మేడమ్ అలియాస్ కేథరిన్, యామిని అలియాస్ రాశి ఖన్నాలు చిత్రంలో పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. జనవరి 3న ఈ చిత్రం టీజర్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 14వ తేదీన వరల్డ్ వైడ్‌గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదల కాబోతోంది. తాజాగా ఈ నలుగురితో విజయ్ ఉన్న లుక్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి.